Asha Bhosle’s son and music composer Hemant Bhosle passes away at 66 | Bollywood Updates

Asha bhosle son hemant bhosle passes away music composer

asha bhosle son died, asha bhosle son hemant died, hemant died with cancer, asha bhosle songs, cancer problems

Asha Bhosle son Hemant Bhosle passes away music composer : Legendary singer Asha Bhosle’s younger son and music composer Hemant breathed his last on September 28. He had been battling with cancer for long and was in Scotland in his last days.

తుదిశ్వాస విడిచిన ఆశాభోంస్లే కుమారుడు

Posted: 09/29/2015 03:28 PM IST
Asha bhosle son hemant bhosle passes away music composer

చిత్రపరిశ్రమలో ప్రముఖ గాయనిగా పేరుగాంచిన ఆశాభోంస్లే ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె పెద్ద కుమారుడు హేమంత్ భోంస్లే సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న హేమంత్.. సోమవారం కన్నుమూశారు. గతకొన్నాళ్ల నుంచి స్కాట్లాండులోనే వుంటున్న హేమంత్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ వ్యాధి నుంచి పోరాడుతూ వచ్చిన ఆయన ఎన్నో చికిత్సలు చేయించుకున్నప్పటికీ లాభం లేకపోయింది. చివరికి ఆయన సోమవారం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన హేమంత్ భోంస్లే.. తన కెరీర్లో పలు సూపర్ హిట్ పాటలను అందించారు. ఆయన కంపోజ్ చేసిన పాటల్లో ఎక్కువ శాతం ఆశా భోంస్లే పాడటం గమనార్హం.

హేమంత్ భోంస్లే మరణానికి ఒక రోజు ముందు ఆశా భోంస్లే ఓ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొనడంలో భాగంగా సింగపూర్‌లో ఉన్నారు. కుమారుడి మరణ వార్త తెలియడంతో వెంటనే ఆమె స్కాట్లాండు వెళ్లారు. సోమవారం ఆశా భోంస్లే సోదరి లతా మంగేష్కర్ పుట్టిరోజు. అయితే.. హేమంత్ మరణంతో పుట్టినరోజు వేడుకలు రద్దయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ స్కాట్లాండు చేరుకున్నారు. మూడేళ్ల క్రితం ఆశా భోంస్లే కూతురు వర్ష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హేమంత్ మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణానికి కొందరు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asha bhosle son died  hemant bhosle cancer  

Other Articles