she movie | latest news | stills | gossips | gallery

She movie latest news

she movie news, she movie latest updates, she movie stills, she movie posters, she movie details, she movie updates, she

she movie latest news: Kalvakuntla tejeswar rao upcoming film she. parsa ramesh mahendra direction. she movie latest news, movies, gossips.

'షీ' తో కేసిఆర్ వారసుడి ఎంట్రీ

Posted: 09/21/2015 03:41 PM IST
She movie latest news

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరుని తనయుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌ రావ్‌(కన్నారావ్‌) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగెడుతున్నారు. గతంలో '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై 'షీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఈజ్‌ వెయింటింగ్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ప్రముఖ మలయాళ నటి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పర్స రమేష్‌ మహేంద్ర మాట్లాడుతూ..''ప్రముఖ మలయాళ నటి హీరోయిన్‌గా నటిస్తున్న మా 'షీ' చిత్రానికి సంబంధించి స్క్రిఫ్ట్‌ వర్క్‌ పూర్తయింది. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్‌ గారి సోదరుని కుమారుడైన కల్వకుంట్ల తేజేశ్వర్‌రావ్‌ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. కథ విన్న వెంటనే ఈ చిత్రాన్ని చేస్తున్నామని..నన్ను ప్రోత్సహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. దసరా నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. ఇతర ఆర్టిస్ట్‌లతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలో తెలియజేస్తాము...'' అని అన్నారు.

ప్రొడ్యూసర్‌: కల్వకుంట్ల తేజేశ్వర్‌రావ్‌(కన్నారావ్‌), కథ-కథనం-మాటలు-దర్శకత్వం: పర్స రమేష్‌ మహేంద్ర

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : she movie  latest news  stills  gossips  gallery  

Other Articles