Anushka | Size Zero | Inji Iduppazhagi | Song Teaser | Movie News | Arya

Anushka inji iduppazhagi movie song teaser

Anushka Inji Iduppazhagi Song Teaser, Anushka Size Zero Audio Release Postponed, Anushka Size Zero Audio Release Date, Anushka Size Zero Latest Posters, Anushka Size Zero Second Look Poster, Anushka Size Zero Second Look, Anushka Size Zero Second Look Stills, Size Zero Second Look Poster, Anushka Size Zero Title Logo, Anushka Size Zero movie news, Anushka Size Zero movie updates, Anushka Size Zero stills, Anushka Size Zero, Anushka, Size Zero

Anushka Inji Iduppazhagi Movie Song Teaser: Starring Arya, Anushka Shetty, Sonal Chauhan, Prakash Raj, Urvashi, Bharat and others, Size Zero is all set for a global release on OCTOBER 2nd, 2015, on the occasion of Gandhi Jayanthi.

గుమ్మడికాయ నడుముతో తిరిగేస్తున్న అనుష్క

Posted: 09/12/2015 12:15 PM IST
Anushka inji iduppazhagi movie song teaser

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇంజి ఇడుప్పజాగీ’. తెలుగులో ‘సైజ్ జీరో’ పేరుతో రూపొందుతోంది. ‘సన్నజాజి నడుము’ అనేది క్యాప్షన్. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల తర్వాత అనుష్క నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అనుష్కకు జోడిగా ఆర్య హీరోగా నటిస్తున్నారు. సోనాల్ చౌహన్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్, ఆడియో టీజర్ లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా మరో టీజర్ ను విడుదల చేసారు. ఇందులో అనుష్క ఒకవైపు ఆర్యతో రొమాన్స్ చేస్తూనే... మరోవైపు టివి రిమోట్ కోసం తెగ వెతికేస్తుంది. ఆర్య, అనుష్కల కెమిస్ట్రీ చాలా బాగుంది. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

ప్రముఖ దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ PVP బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పోట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై వున్న అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Inji Iduppazhagi  Song Teaser  Movie News  Arya  

Other Articles