Actress Samantha wants to quit films

Actress samantha wants to quit films

Samantha wants to quit films, Samantha quit films, Samantha latest news, Samantha movie news, Samantha interview, Samantha hot news, Samantha stills, Samantha

Actress Samantha wants to quit films: tollywood actress Samantha wants to quit from films. Samantha upcoming film 10 Endrathukulla. vikram hero.

అలా జరిగితే సినీ సన్యాసం పక్కా అంటున్న సమంత

Posted: 08/25/2015 03:52 PM IST
Actress samantha wants to quit films

తెలుగు సినీ ఇండస్ట్రీకి ‘ఏమాయ చేసావే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, తెలుగు ప్రేక్షకుల మదిలో ‘జెస్సీ’గా సుస్థిర స్థానం దక్కించుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత. అలాంటి ఈ అమ్మడు గత ఏడాది సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒకప్పుడు ఈ అమ్మడు నటించిన అన్ని సినిమాలు హిట్టు కావడంతో ‘గోల్డెన్ లెగ్’ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుండటంతో ‘ఐరెన్ లెగ్’ హీరోయిన్ అంటూ కామెంట్లు వినిపించాయి. దీంతో ఈ అమ్మడికి ఒళ్లుమండి ‘మంచి పాత్రలు దొరకకపోతే... సినిమాలకు త్వరలోనే స్వస్తి పలుకుతాను’ అంటూ అప్పట్లో చెప్పుకొచ్చింది.

ఎందుకంటే ఈ అమ్మడు నటించిన పలు చిత్రాలు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సూర్య సరసన ‘అంజాన్’ సినిమాలో ఈ అమ్మడు బికినీ వేసినప్పటికీ కూడా ఏం లాభం లేకపోయింది. అభిమానులు ఈ చిత్రాన్ని అట్టర్ ఫ్లాప్ చేసారు. అయితే ఈ మధ్య సమంత నటిస్తున్న పలు చిత్రాలు విజయం సాధిస్తుండటంతో మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో విక్రమ్ సరసన ‘10 ఎంద్రతుకుల్ల’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలకు దూరమవుతానంటూ మళ్లీ కామెంట్లు చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూలో సదరు జర్నలిస్ట్... ‘ఇపుడు మీకు మంచి పాత్రలే లభిస్తున్నాయా?’ అనే అడగగా.. అందుకు సమంత తనదైన శైలిలో స్పందించింది.

సమంత మాట్లాడుతూ.... 2014లో చెప్పినట్లుగానే నాకు మంచి పాత్రలు రాకపోతే తప్పకుండా సినిమాల నుంచి తప్పుకుంటాను. ఇంకా అదే మాటపై నిలబడతాను. అయితే ప్రస్తుతం తనకు మంచి పాత్రలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.

కానీ ఈ అమ్మడి మాటలకు సినీ వర్గాలు మరొక విధంగా కామెంట్లు చేస్తున్నారు. సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో అంత గొప్ప పాత్రలేమి వున్నాయని, అవే పాత గ్లామర్ పాత్రలు తప్ప... కొత్తగా ఏం లేవంటూ కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  quit  news  stills  interview  gallery  

Other Articles