ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, ‘నువ్వు నేను’, జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హోరా హోరీ’. దిలీప్,దక్ష హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’మా నాన్నగారి స్ఫూర్తితో నేను నిర్మాతగా మారాను. వైవిధ్యమైన కథాచిత్రాలను అందించిన మా బ్యానర్ లో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ తేజ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. దిలీప్, దక్ష చాలా చక్కగా నటించారు. ఇందులో అందరూ కొత్త నటీనటులే నటించారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల కళ్యాణ్ కోడూరిగారు అందించిన ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చిది. కర్ణాటకలో 53రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది. దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరి. తేజ మరోసారి ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.
దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్; ఎడిటర్: జునైద్; కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ; స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్, కెవిన్; సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి ; నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్; కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more