Kalakeya Prabhakar Latest Interview

Bahubali kalakeya prabhakar latest interview

Kalakeya Prabhakar Latest Interview, Kalakeya Prabhakar Interview, Kalakeya Prabhakar Special Story, Kalakeya Prabhakar Latest News, Kalakeya Prabhakar Latest Articles, Kalakeya Prabhakar News, Kalakeya Prabhakar

Bahubali Kalakeya Prabhakar Latest Interview: Tollywood actor Kalakeya Prabhakar Latest block buster film Bahubali. Prabhakar acts in Kalakeya role in this film. SS Rajamouli direction. Prabhas, Rana acts in lead roles.

మలైకా కోసం వెళ్లి కాలకేయగా మారిపోయాడు

Posted: 08/25/2015 02:06 PM IST
Bahubali kalakeya prabhakar latest interview

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘బాహుబలి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై అన్ని రికార్డులను బద్దలుకొట్టాయి. బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోలుగా నటించిన ప్రభాస్, రానాలకే కాకుండా విలన్ గా నటించిన వ్యక్తికి కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఆ వ్యక్తి కాలకేయ.

‘కాలకేయ’ పాత్రలో నటించిన నటుడు ప్రభాకర్. ఈ పాత్రకు ప్రభాకర్ ప్రాణం పోసాడనే చెప్పుకోవచ్చు. ఇందులో ప్రభాకర్ చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. కృరత్వమైన కాలకేయ పాత్రలో అదరగొట్టాడు. భయంకరమైన గెటప్, మాములు జనాలకు అర్థంకాని కిలికిలి భాషలో ప్రభాకర్ అదరగొట్టాడు. కేవలం ఈ ‘కాలకేయ’ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రజాధారణ దక్కించుకున్నాడు ప్రభాకర్. అలాంటి ప్రభాకర్ ఇంతటి క్రేజ్ ను, ‘బాహుబలి’లో ఎలా అవకాశం దక్కించుకున్నాడో ఒకసారి తెలుసుకుందామా!బాల్యం:
హస్నాబాద్ కు దగ్గరలో వున్న రాయచూర్ లో జన్మించారు. ప్రభాకర్ చదువులు హస్నాబాద్ మరియు వికారాబాద్ లోని అనంత పద్మానాభ కాలేజ్ లో సాగాయి. ప్రభాకర్ కు ఒక తమ్ముడు, చెల్లెలు వున్నారు. ఇంటర్ లో వున్నపుడు ప్రభాకర్ తండ్రి మరణించారు. దీంతో కుటుంబ భారం మొత్తం ప్రభాకర్ తల్లిపై పడింది. తన కుటుంబానికి సాయంగా వుండటానికి ఏదైనా ఉద్యోగం చేయాలని హైదరాబాద్ వచ్చేసారు. ఆ తర్వాత బంధువుల సలహా మేరకు పోలీస్ అవ్వాలని పలు ప్రయత్నాలు చేసారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం లభించలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కున్నారు. బంధువులు, స్నేహితులు ఏం పనిచేయట్లేదంటూ వెకిలి చేసేవారు. అయితే అనుకోకుండా ఓ రోజు ప్రభాకర్ సీనియర్ ప్రవీణ్ పొగాకు అనే వ్యక్తి తన భాధాలను అర్థం చేసుకొని ఆర్థికంగా ప్రభాకర్ ను ఆదుకున్నాడు.  సీన్ కట్ చేస్తే...
సినిమాల్లోకి ఎంట్రీ:
ఓ రోజు పద్మాలయ స్టూడియోలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ హీరోగా ‘అతిథి’ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అక్కడ మలైకా అరోరాను చూడటానికి ప్రభాకర్ తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇంతలోనే సురేంధర్ రెడ్డి కంట్లో పడిపోయాడు ప్రభాకర్. తన స్నేహితుడు సురేందర్ రెడ్డికి పరిచయం చేయడంతో వెంటనే అదే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం నెలకు 10వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు. వెయ్యి రూపాయలు కూడా లేని ప్రభాకర్ కు రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడు తన సినిమాల్లో అవకాశం ఇచ్చి, 10 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి.


Video Courtesy : SriBalajiMovies

ఆ తర్వాత ప్రభాకర్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం ‘మర్యాద రామన్న’. ఈ సినిమాలో ప్రధాన విలన్ లలో ఒకరిగా ప్రభాకర్ చాలా చక్కగా నటించాడు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో చాలా మంది నిరాశపరిచి, తప్పుగా ప్రచారం చేసినప్పటికీ దర్శకుడు రాజమౌళి మాత్రం తనకు చాలా హెల్ప్ చేసి, తనను నమ్మి ఈ పాత్రను ఇచ్చారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రభాకర్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అవడం.. ఆ తర్వాత ప్రభాకర్ కు మంచి పేరుతో పాటుగా వరుసగా పలు సినిమాల్లో అవకాశాలను తెచ్చిపెట్టింది.

‘మర్యాద రామన్న’ తర్వాత గబ్బర్ సింగ్, దూకుడు నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 చిత్రాలలో నటించారు. ‘మర్యాద రామన్న’ తర్వాత ప్రభాకర్ కు మళ్లీ రాజమౌళి సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. కానీ ఓ రోజు అనుకోకుండా రాజమౌళి నుంచి ప్రభాకర్ కు పిలుపొచ్చింది. తన తర్వాత సినిమాలో ప్రభాకర్ కు మరోసారి అవకాశం ఇచ్చి ప్రోత్సాహించారు. అదే ‘బాహుబలి’ చిత్రంలోని కాలకేయ పాత్ర.

Video Courtesy : Vaaraahi Chalana Chitram

ఈ పాత్ర గురించి రాజమౌళి పూర్తిగా వినిపించిన విధానం తనకు బాగా నచ్చేసిందని, అంతే కాకుండా ఈ పాత్ర కోసం మేకప్ విషయంలో చాలా కష్టపడ్డారని, ముఖ్యంగా ఆ కిలికిలి భాష నేర్చుకోవడం చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని ప్రభాకర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒక్కసారిగా కాలకేయ పాత్రకు సంబంధించిన మేకప్ పూర్తయ్యాక, కిలికిలి భాషలో ఆ డైలాగ్స్ చెబుతుంటే యూనిట్ మొత్తం అభినందించారని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విడుదలయ్యాక ‘కాలకేయ’ పాత్రకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాకర్ అంటే తెలియనివారికి కూడా కాలకేయ పాత్ర ద్వారా అందరికి పరిచయం అయిపోయాడు. 

ఇక ప్రభాకర్ కుటుంబ విషయానికొస్తే... ప్రభాకర్ భార్య పేరు రాజ్య లక్ష్మీ. వీరిద్దరికి ఇద్దరు సంతానం. ఈ ఇద్దరిలో ఒకరికి రాజమౌళి పేరు పెట్టుకున్నాడు ప్రభాకర్. ఒకరి పేరు శ్రీరామ్ రాజమౌళి, మరొకరు రిత్విక్ ప్రీతం. రాజమౌళి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావిస్తుంటాడు ప్రభాకర్. ప్రస్తుతం ప్రభాకర్ వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాకర్ తన పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు వహిస్తున్నాడు. మరి భవిష్యత్తుల్లో ప్రభాకర్ మరిన్ని విభిన్న పాత్రలలో నటించి, నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలిని కోరుకుందాం.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Kalakeya  Prabhakar  Latest Interview  Bahubali  News  Stills  

Other Articles