Kajol | Ajay Devgn | Cries | stills | news

Ajay devgn clarifies on kajol crying

Kajol crying, Kajol cries, Kajol latest news, Kajol movie news, Kajol latest updates, Kajol latest details, Kajol devgn, Kajol ajay, Kajol news, Kajol stills, Kajol

Ajay Devgn clarifies on Kajol crying: Actress Kajol recently spotted crying during the media interaction at an event in Mumbai.

బాలీవుడ్ భామ కాజోల్ ఏడ్చి వెళ్లిపోయింది

Posted: 08/18/2015 11:10 AM IST
Ajay devgn clarifies on kajol crying

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ మళ్లీ ‘దిల్ వాలే’ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాజోల్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే కాజోల్ ఓ కార్యక్రమంలో పాల్గొంది. అయితే అనుకోకుండా ఈ అమ్మడికి ఫోన్ కాల్ రావడంతో ఏడుస్తూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అసలు ఏం జరిగిందో తెలియక అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాజల్ ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఓ ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అక్కడి నుంచి ఏడుస్తూ, కళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చేసింది. అంతే కాకుండా తన కారులో డ్రైవర్ వున్నప్పటికి తానే డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్ గా వెళ్లిపోయింది.

 

Video Courtesy : iansindia

 

అసలు ఏం జరిగిందో తెలియక అక్కడివారంతా ఆందోళనకు గురయ్యారు. కానీ అసలు విషయం ఓ మూడు రోజుల తర్వాత బయటకొచ్చేసింది. కాజల్-అజయ్ దేవగణ్ దంపతుల కుమారుడు యుగ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడట. ఈ విషయంపై కాజోల్ కు ఫోన్ కాల్ రావడంతో తట్టుకోలేక వెంటనే ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయింది.

అయితే ఈ విషయంపై అజయ్ దేవగణ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... యుగ్ ఇపుడు బాగానే వున్నాడు. మళ్లీ స్కూల్ కు వెళ్తున్నాడు. తన కొడుకు ఆరోగ్యం గురించి, కాజోల్ ఆందోళన గురించి స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ తెలియజేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajol  Ajay Devgn  Cries  stills  news  

Other Articles