Actress Asin Is Getting Married To Businessman Rahul Sharma

Actress asin is getting married to businessman rahul sharma

Asin Is Getting Married To Rahul Sharma, Asin Marriage with Rahul Sharma, Asin Rahul Sharma marriage news, Asin Rahul Sharma Love, Asin Rahul Sharma stills, Actress Asin latest news, Actress Asin movies, Actress Asin movie updates, Actress Asin hot news, Actress Asin stills, Actress Asin gallery.

Actress Asin Is Getting Married To Businessman Rahul Sharma: Actress Asin, who has worked in both the South Indian and Hindi film industries, is finally getting married to businessman Rahul Sharma.

మైక్రోమాక్స్ పెద్దసారుతో ఆసిన్ పెళ్లి సిద్ధం

Posted: 08/10/2015 01:52 PM IST
Actress asin is getting married to businessman rahul sharma

‘గజిని’ సినిమాలో ‘హవాయ్ మొబైల్ కంపెనీ’ యజమాని సంజయ్ సామితో ఆసిన్ ప్రేమలో పడుతుంది గుర్తుందా? అయితే అది సినిమాలో.. కానీ నిజజీవితంలో కూడా అలాగే జరిగింది. కాకపోతే మనిషి, పేరు, కంపెనీ పేరు.. మూడు మారిపోయాయి అంతే. ఈ కేరళ కుట్టి ఆసిన్ గతకొద్ది కాలంగా ప్రముఖ మైక్రోమాక్స్ సంస్థ యాజమాని అయినటువంటి రాహుల్ శర్మతో ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆసిన్ ను అడిగితే... అలాంటిదేమి లేదని తప్పించుకు తిరిగింది. అంతే కాకుండా ఇలా అడిగిన మీడియాపైనే కస్సుబుస్సులాడింది. కానీ ఎట్టకేలకు అదే వార్తలను ఇటీవలే నిజమేనంటే ఒప్పేసుకుంది.

తెలుగులో ‘అమ్మనాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు... అగ్ర, స్టార్ హీరోల సరసన జతకట్టింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన పలు చిత్రాలు హిట్టవ్వడంతో ఇక బాలీవుడ్ కే మకాం మార్చేసింది.
గతకొద్ది కాలంగా ఈ అమ్మడికి సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘వెల్ కం బ్యాక్’ అనే చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఆసిన్ పెళ్లిపీటలు ఎక్కనుంది.

ప్రముఖ మైక్రోమాక్స్ సంస్థ యాజమాని అయినటువంటి రాహుల్ శర్మను ఆసిన్ ప్రేమవివాహం చేసుకోనుంది. వీరిద్దరూ గతరెండుళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారట. ఈ 36 ఏళ్ల బిలియనీర్ తో ఆసిన్ బాగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగేసింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి కూడా సినీ ఆఫర్లు తగ్గిపోవడంతో ఇక పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని నిశ్చయించుకుంది. త్వరలోనే వీరి పెళ్లి వార్తను ఆహ్వాన పత్రికల ద్వారా అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Asin  love  marriage  Rahul Sharma  News  stills  

Other Articles