Rajamouli talks about Sri Krishna role in Mahabharata film

Rajamouli talks about sri krishna role in mahabharata film

NTR Sri Krishna role in Rajamouli Mahabharata film, Rajamouli Mahabharata film news, Rajamouli Mahabharata film cast, ntr in Rajamouli Mahabharata film, NTR movie news, NTR as sri krishna, NTR movie details, NTR stills, NTR

Rajamouli talks about Sri Krishna role in Mahabharata film: SS Rajamouli dream project Mahabharatam. Rajamouli says I will cast NTR as Lord Sri Krishna. Rajamouli latest news, movies, details, stills, interviews.

శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ పర్ఫెక్ట్ అంటున్న జక్కన్న

Posted: 08/10/2015 12:01 PM IST
Rajamouli talks about sri krishna role in mahabharata film

టాలీవుడ్ టాప్ 1 డైరెకర్ట్ ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి - ది బిగినింగ్’ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే కాకుండా భారీ కలెక్షన్ల మోత మోగిస్తుంది. దీంతో ‘బాహుబలి- ది కన్ క్లూజన్’ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఈ సినిమా విషయంలో రాజమౌళిపై మరింత బాధ్యత పెరిగింది. ప్రస్తుతం ఈ చిత్ర సీక్వెల్ స్ర్కిప్ట్ పనుల్లో రాజమౌళి బిజీ అయ్యాడు. ‘బాహుబలి’ చిత్రం మొత్తం పూర్తయ్యాక... రాజమౌళి తర్వాత చిత్రం ఎలాంటి తీయనున్నాడోనని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. అయితే త్వరలోనే మహేష్ తో ఓ సినిమా చేస్తానని  రాజమౌళి ప్రకటించడంతో... ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తో ఓ సినిమా వుండనుందని అందరూ అనుకున్నారు.

కానీ మళ్లీ అందరిని అంచనాలను తారుమారు చేసే విధంగా రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. రాజమౌళి తన కెరీర్లో ఎప్పటికైనా మహాభారతం సినిమా చేయాలనీ ఎదురుచూస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడివారు... ‘మహాభారతం సినిమా తీస్తే అందులో ఎవరిని శ్రీకృష్ణుడి పాత్రకోసం ఎంచుకుంటారు? అని అడిగారు.

దీనికి సమాధానంగా రాజమౌళి వెంటనే స్పందిస్తూ... ఇప్పుడున్న యంగ్ హీరోలలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడని తెలిపాడు. రాజమౌళి ఇచ్చిన ఈ సమాధానంపై నందమూరి అభిమానులు కాస్త సంతోషంగానే వున్నప్పటికీ... మహేష్ అభిమానులు మాత్రం కాస్త నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే.. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ‘మహభారతం’ సినిమా చేస్తాడో లేక మహేష్ తో సినిమా చేస్తాడో అనే విషయం తెలియక అభిమానులు కంగారుపడుతున్నారు. మరి ఈ విషయాలపై సరైన క్లారిటీ రావాలంటే ‘బాహుబలి’ సీక్వెల్ విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

rajamouli-ntr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Rajamouli  Sri krishna  Mahabharata  movie news  

Other Articles