Madhur Bhandarkar Calendar Girls Movie Censor Report

Madhur bhandarkar calendar girls movie censor report

Calendar Girls Movie Censor Report, Calendar Girls Movie stills, Calendar Girls Movie posters, Calendar Girls Movie first look, Calendar Girls Movie hot wallpapers, Calendar Girls Movie details, Calendar Girls Movie updates, Calendar Girls Movie

Madhur Bhandarkar Calendar Girls Movie Censor Report: Bollywood Director Madhur Bhandarkar latest film Calendar Girls. This Movie Censor Process Completed. first look poster released.

బికినీ భామలకు బాగా కత్తెర పడిందట!

Posted: 06/17/2015 03:48 PM IST
Madhur bhandarkar calendar girls movie censor report

ఒక కత్తిలాంటి భామ బికినీలో దర్శనమిస్తే ఎలా వుంటుందో మీరే ఊహించుకోండి. భలే రంజూగా వుంది కదూ! సెక్సీ హాట్ ఫిగరు బికినీలో కనిపిస్తే ఇక కుర్రకారులను ఆపడం కష్టమే. ఒక్క భామ అలా బికినీలో కనిపిస్తేనే పరిస్థితి ఊహించుకోలేకపోతే... ఇక ఒకేసారి ఐదుగురు కత్తిలాంటి భామలు బికినీలో వచ్చి సెక్సీ ఫోజ్ ఇస్తే ఇంకెంత గరంగరంగా వుంటుందో ఊహించుకోండి.

ప్రస్తుతం బాలీవుడ్ సినీ ప్రేక్షకులందరి పరిస్థితి అలాగే మారింది. ముఖ్యంగా యువత పరిస్థితి మరి దారుణం. ఇంతకీ ఆ భామలు ఎవరు? అసలు ఏంటి విషయం అని అనుకుంటున్నారా? అసలు మ్యాటరేంటంటే.... బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘క్యాలెండర్ గర్ల్స్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మధుర్ తీసిన అన్ని సినిమాలు కూడా నిజజీవితంలోని ఏదో ఒక అంశంపైనే తెరకెక్కించినవే.

బార్ గర్ల్స్ జీవితంపై ‘చాందిని బార్’, మోడలింగ్ గర్ల్స్ పై ‘ఫ్యాషన్’, కథానాయికల జీవితంపై ‘హీరోయిన్’ లాంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇపుడు ‘క్యాలెండర్ గర్ల్స్’. ఈ మధ్య క్యాలెండర్ ఫోటో షూట్ లు బాగా ఎక్కువయ్యాయి. ఈ ఫోటోషూట్ వల్ల సదరు కంపెనీ వారికి భారీగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటు ఈ ఫోటోషూట్ లో పాల్గొన్న భామలకు భారీ రెమ్యునరేషన్, పబ్లిసిటీ, సినిమాల్లో అవకాశాలు, క్రేజ్... ఇలా ఉపయోగాలు. మొత్తానికి చాలా మంది భామలు ఈ క్యాలెండర్ ఫోటోషూట్ లలో పాల్గొంటున్నారు.

అందుకే వీరి జీవితం మీద ‘క్యాలెండర్ గర్ల్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మధుర్. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. అలాగే ట్రైలర్ ను కూడా రెడీ చేసారు. కానీ ఈ ట్రైలర్లో భారీగా నగ్న సన్నీవేశాలుండటంతో సెన్సార్ వారు చాలా కటింగ్స్ పెట్టినట్లుగా తెలిసింది. సెన్సార్ పూర్తయిన తర్వాత ఆ ట్రైలర్ కు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో సెక్సీ, హాట్ మోడల్స్ ను, ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించని కొత్త భామలను ఎంపిక చేసారు. ఇందులో ఈ భామలు తమ అందచందాలతో పిచ్చెక్కించనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నారు. మరి ఈ ట్రైలర్ ఎలాంటి హాట్ టాపిక్ కానుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Calendar Girls Movie  Censor Report  Hot stills  Posters  

Other Articles