Mahesh Srimanthudu Audio Songs Leaked

Mahesh srimanthudu audio songs leaked

Srimanthudu Audio Songs Leaked, Srimanthudu Audio Songs, Srimanthudu movie latest news, Srimanthudu movie updates, Srimanthudu stills, Srimanthudu movie posters, Srimanthudu trailer, Srimanthudu teaser, Srimanthudu, Mahesh Babu movie news, Mahesh Babu stills, Mahesh Babu

Mahesh Srimanthudu Audio Songs Leaked: Mahesh Babu latest film Srimanthudu Audio Songs Leaked. Koratal siva direction, Devi sri prasad music, Shruti haasan heroine.

మహేష్ బాబు శ్రీమంతుడు పాటలు లీక్

Posted: 06/17/2015 05:20 PM IST
Mahesh srimanthudu audio songs leaked

ఇప్పటి వరకు సినిమాలనే కాకుండా ఇపుడు ఏకంగా పాటలను కూడా లీక్ చేసేస్తున్నారు. ఆడియో విడుదలకు ముందే పాటలు లీక్ అయిపోతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మహేష్ ‘శ్రీమంతుడు’ వచ్చి చేరింది.

మహేష్ బాబు నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్ర ఆడియో ట్రాక్ లు తాజాగా లీక్ అయ్యాయి. వాట్సప్, సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లలో ఈ ఆడియో ట్రాక్ లు తెగ హల్చల్ చేస్తున్నాయి.

గతంలో దేవి సంగీతం అందించిన పలు చిత్రాల ఆడియో ట్రాక్ లు కూడా ఇలాగే లీక్ అయ్యాయి. కానీ వీటిపై దర్శకనిర్మాతలు ఎన్నడూ కూడా సీరియస్ అవ్వలేరు. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. అయితే ఈ లీకైన ఆడియో ట్రాక్ లపై కొందరు రివ్యూలు కూడా రాసేస్తున్నారు.

మొత్తానికి మహేష్ ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఆడియో నుంచే లీకులు మొదలయ్యాయన్నమాట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర ఆడియోను జూన్ 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని జులై 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Songs leaked  Teaser  

Other Articles