Sai korrapati bags Baahubali Karnataka rights

Sai korrapati bags baahubali karnataka rights

Baahubali Karnataka rights sold out, Baahubali Karnataka rights sold, Baahubali Karnataka rights, Baahubali film Karnataka rights, Baahubali Karnataka rights bags, Baahubali movie latest news, Baahubali movie updates, Baahubali stills, Baahubali movie details, Baahubali posters, Baahubali songs, Baahubali jukebox, Baahubali

Sai korrapati bags Baahubali Karnataka rights: Prabhas latest film Baahubali. Rajamouli direction, Keeravani music. Baahubali Karnataka rights sold out.

కర్ణాటకలో బాహుబలి రికార్డ్ స్థాయిలో విడుదల

Posted: 06/17/2015 01:29 PM IST
Sai korrapati bags baahubali karnataka rights

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమా గురించి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రమోషన్ జరిగిపోయింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో ఇప్పటికే ‘బాహుబలి’కి భారీగా బిజినెస్ జరుగుతోంది.

తాజాగా ఈ చిత్రానికి కర్ణాటకలో భారీ బిజినెస్ జరిగినట్లుగా తెలిసింది. ‘బాహుబలి’ కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను పొందారు. ‘బాహుబలి’కి సంబంధించిన అన్ని వర్షెన్ లను సాయికొర్రపాటి కర్ణాటకలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో దుమ్ముదులిపేస్తున్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ప్రస్తుతం టాప్ 1 స్థానంలో నిలిచాయి. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Karnataka rights  Release Date  Trailer  Songs  

Other Articles