Anil Ravipudi next film with Saidharam tej

Anil ravipudi next film with saidharam tej

Anil Ravipudi next film under dil raju banner, Anil Ravipudi next film, Anil Ravipudi movie news, Anil Ravipudi latest film, Anil Ravipudi film updates, Anil Ravipudi movie details, Anil Ravipudi sai dharam tej movie, Anil Ravipudi dil raju movie

Anil Ravipudi next film with Saidharam tej: Pataas film Director Anil Ravipudi next film with Saidharam tej under dil raju banner.

సాయిధరమ్ తేజ్ తో పటాస్ కొత్త సినిమా

Posted: 06/17/2015 11:13 AM IST
Anil ravipudi next film with saidharam tej

‘పటాస్’ అంటూ ఈ ఏడాది నందమూరి కళ్యాణ్ రామ్ కు తొలి భారీ విజయాన్ని అందించి, దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అనిల్ రావిపూడి. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో రూపొందిన ‘పటాస్’ ఈ ఏడాది తొలి విజయాన్ని అందించింది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా అనిల్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత అనిల్ తన రెండవ చిత్రానికి సిద్ధమయ్యాడు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ తన రెండవ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇందులో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించబోతున్నాడు. సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా అనిల్ ఓ కథను సిద్ధం చేసాడని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్ర స్ర్కిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ హీరోగా దిల్ రాజు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Ravipudi  Sai dharam tej  Dil Raju  Movie News  

Other Articles