Jyothika | interview | 36 Vayadhinile | Kollywood News

Jyothika latest interview on 36 vayadhinile

Jyothika latest news, Jyothika interview, Jyothika updates, Jyothika latest updates, Jyothika movie details, Jyothika movies, Jyothika songs, Jyothika stills, Jyothika gallery.

Jyothika latest interview on 36 Vayathinile: tamil actress Jyothika hot comments on her acting career. Jyothika latest film news, gossips, updates, stills, gallery

ఈ చంద్రముఖి బాగా ఓవర్ యాక్టింగ్ చేసిందట!

Posted: 06/16/2015 11:34 AM IST
Jyothika latest interview on 36 vayadhinile

తమిళ స్టార్ హీరో సూర్య భార్య, ప్రముఖ నటి జ్యోతిక ఇటీవలే ‘36 వయోదినిలే’ చిత్రంతో సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సంధర్భంగా ఇటీవలే జ్యోతిక మీడియాతో మాట్లాడుతూ తన సహజ నటనను ఎవరూ గుర్తించడం లేదని వాపోయింది.

జ్యోతిక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 36 వయోదినిలే చిత్ర విజయం చాలా ఆనందాన్నిచ్చిందని, కానీ ఈ సినిమాలో తాను కొన్ని సీన్లలో మాత్రమే యధార్థంగా నటించానని తెలిపింది. మిగతా సన్నీవేశాలలో అంతా ఓవర్ యాక్టింగ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమానే కాకుండా తాను నటించిన అన్ని సినిమాల్లో కూడా తన యాక్టింగ్ ఓవర్ గా వున్నట్లుగా అనిపిస్తుందని జ్యోతిక తెలిపింది.

ఇక తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన ‘చంద్రముఖి’ సినిమాలో కూడా అంతే ఓవర్ గా అనిపిస్తుందని జ్యోతిక తెలిపింది. అయితే తాను సహజత్వంగా నటిస్తుంటే... దర్శకులు తనకు ఏదో హెల్త్ బాగోలేదని అనుకునేవారని, హుషారుగా నటించమంటూ ఓవర్ యాక్షన్ నుంచి బయటపడకుండా చేసేసారని జ్యోతిక తెలిపింది.

జ్యోతిక నటించిన ‘36 వయోదినిలే’ చిత్రాన్ని తెలుగులో ‘రావమ్మా మహాలక్ష్మీ’ పేరుతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో విడుదల చేసి, విడుదల తేదిని ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothika  interview  movies  News  stills  

Other Articles