Charmme kaur | apologizes | nithin | Puri Jagannadh

Charmme kaur apologizes to nithin and puri jagannadh

Charmme kaur apologizes to nithin, Charmme kaur apologizes, Charmme kaur apologizes to Puri jagannadh, Charmme kaur latest news, Charmme kaur movie news, Charmme kaur movie updates, Charmme kaur stills, Charmme kaur gallery

Charmme kaur apologizes to Nithin and Puri Jagannadh: Tollywood Hot Actress Charmme kaur apologizes to hero nithin and Director Puri Jagannadh. Charmme kaur latest news, gossips, tweets, stills, gallery.

నితిన్, పూరీలకు క్షమాపణలు చెప్పిన జ్యోతిలక్ష్మీ

Posted: 06/16/2015 11:03 AM IST
Charmme kaur apologizes to nithin and puri jagannadh

‘హర్ట్ ఎటాక్’ చిత్రం తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోయి, ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోవడంపై ఛార్మి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాకు ప్రొడక్షన్ మొత్తం దగ్గరుండి చూసుకున్న ఈ అమ్మడు... పూరీ తర్వాతీ సినిమాలో కూడా తెగ జోక్యం చేసుకుంటుందట. దీంతో పూరీ తర్వాతీ సినిమాపై పలు కామెంట్లు చేసేసింది.

ఆ ప్రాజెక్టు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆగిపోయిందంటూ ఛార్మి తెలిపింది. కానీ పూరీతో నితిన్ ప్రాజెక్టు ఆగిపోవడానికి గల కారణం ఛార్మినే అని పలు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్, పూరీల ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఛార్మి కూడా జోక్యం చేసుకుంటుందని, అందుకే ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ తప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Charmme kaur apologizes to nithin-02

అయితే తాను చేసిన కామెంట్లపై ఛార్మి మళ్లీ వివరణ ఇచ్చుకోలేక తప్పలేదు. తాజాగా ఈ విషయంపై ఛార్మి స్పందిస్తూ... నిజానికి పూరీ, నితిన్ ల ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో తనకు కూడా స్పష్టంగా తెలియదని, అయితే ఏవో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ఎవరో చెబితే అదే నిజమనుకొని చెప్పేసానని తెలిపింది. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా అలా నేరుగా చెప్పినందుకు సిన్సియర్ గా క్షమాపణలు తెలియజేస్తున్నానని ఛార్మి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmme kaur  apologizes  nithin  Puri Jagannadh  

Other Articles