Finally Allu Sirish started his third movie with director parashuram | tollywood news

Allu sirish third movie starts director parashuram new project

allu sirish, allu sirish news, allu sirish photos, allu sirish photo shoot, allu sirish new movie, allu sirish movie updates, director parashuram, parashuram new project

allu sirish third movie starts director parashuram new project : Finally Allu Sirish started his third movie with director parashuram. Thursday movie muhurtham done. This movie will go on floors from next month.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శిరీష్ మూడో సినిమా షురూ!

Posted: 06/11/2015 06:42 PM IST
Allu sirish third movie starts director parashuram new project

అల్లువారి కుటుంబం నుంచి వచ్చిన యువహీరో అల్లు శిరీష్.. ‘గౌరవం’తో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘కొత్తజంట’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శిరీష్.. ఆ మూవీతో కాస్త ఫర్వాలేదనిపించుకున్నాడు. అంతే.. అప్పటినుంచి శిరీష్ తదుపరి చిత్రానికి సంబంధంచి అస్సలు వార్తలే వినిపించలేదు. తనకు మూడో సినిమా చేయాలని వుందని శిరీష్ వెల్లడించాడు కానీ.. మంచి కథ దొరకనందున చేయలేకపోయాడు. పైగా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది కాబట్టి.. ఆ తరహా కథ కోసం వెయిట్ చేశాడు. ఇప్పుడు ఇన్నాళ్లకు ఇతని నిరీక్షణకు శుభంకార్డు పడింది.

చాలాకాలం తర్వాత అల్లు శిరీష్ తాజాగా తన మూడో సినిమాను మొదలుపెట్టేశాడు. శిరీష్ కి తగిన విధంగా దర్శకుడు పరశురాం సరికొత్త కథను సిద్ధం చేశాడు. ‘యువత’, ‘ఆంజనేయులు’, ‘సోలో’ వంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు పరశురామ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! అయితే.. ‘సారొచ్చారు’తో పరాభావం ఎదుర్కొన్న తర్వాత ఈ దర్శకుడు కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు శిరీష్ కోసం సరికొత్త కథను సిద్ధం చేసి... తన మీద పడిన ఫ్లాప్ మార్కును తుడిపేసుకునేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ సినిమా శిరీష్ క్రేజ్ ని పెంచేలా చేస్తుందని పరశురాం బలమైన నమ్మకంతో వున్నాడు.

గురువారం ఉదయం శిరీష్, పరశురాం కొత్త మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెలలో సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరగనుంది. లవ్, సెంటిమెంట్ కి ప్రాధాన్యమిస్తూ తయారుచేసిన ఈ కథకి మంచి మార్కులే దక్కుతాయని దర్శకుడు భావిస్తున్నాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శిరీష్ చేస్తున్న ఈ సినిమా.. అతడు ఆశించిన ఫలితాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu sirish  parashuram  tollywood  

Other Articles