Trisha Krishnan says that hero arya is her darling | kollywood news | tollywood

Trisha krishnan darling tamil hero arya kollywood updates

trisha krishnan, trisha news, trisha gossips, trisha interview, trisha photo shoot, actor arya, arya latest updates, trisha photo gallery, trisha press meet, trisha latest news

trisha krishnan darling tamil hero arya kollywood updates : South Indian actress trisha krishnan had said in her latest interview that actor arya is her darling.

త్రిష ‘డార్లింగ్’ ఎవరో తెలిసిపోయిందోచ్!

Posted: 06/11/2015 10:32 AM IST
Trisha krishnan darling tamil hero arya kollywood updates

వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం చేసుకున్న అనంతరం వీరిద్దరి ఎంతో హ్యాపీగా తమ కాలాన్ని ఎంజాయ్ చేశారు. ఇక పెళ్లే తరువాయి అన్నంతగా వీరిద్దరి ప్రేమకథ అనూహ్యంగా సాగింది. కానీ.. ఇంతలోనే ఏమయ్యిందో తెలీదుకాదు.. తామిద్దరం విడిపోయినట్లుగా స్వయంగా త్రిష వెల్లడించింది. దీంతో చాలామంది ఈమె అభిమానులు, సినీజనాలకు ఆ వార్త కాస్త చేదుగానే అనిపించింది. పెళ్లి క్యాన్సిల్ అయితేనేం.. తాను మాత్రం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా వున్నానని త్రిష వెల్లడిస్తోంది.

అంతేకాదు.. మునుపటికంటే ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తుండటంతో ఈమె ఆనందానికి అంతులేకుండా పోయింది. తానిప్పుడు ఎంతో హ్యాపీగా వున్నానని తెలుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఈమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను తనకు నచ్చిన హీరోల జాబితా వెల్లడిస్తూనే.. వారిలో తన డార్లింగ్ ఎవరో ఈ భామ తెలిపింది. ముఖ్యంగా తమిళ హీరో ఆర్యపై తనకున్న గౌరవాన్ని వెల్లడించింది. ‘ఆర్య నా డార్లింగ్.. జీవితాన్ని ఎలా గడపాలో ఆయన నుంచే నేర్చుకోవాలి’ అంటూ త్రిష స్పష్టం చేసింది. ఈ విధంగా ఆర్య గురించి త్రిష వెల్లడించడంపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. బహుశా ఆర్య, త్రిష ప్రేమలో పడ్డారేమోనని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. త్రిష ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ నేపథ్యంలో తన పెళ్లి వ్యవహారం గురించి చర్చించింది. తనను జీవితాంతం సంతోషపెట్టే భర్త కావాలని ఆమె కోరుకుంటున్నట్లుగా తెలిపింది. అలాగే తనకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని కనాలని వుందని మనసులో మాటను బహిర్గతం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha krishnan  actor arya  tollywood  

Other Articles