mahesh babu srinu vaitla production house tollywood film nagar

Mahesh babu srinu vaitla production house tollywood film nagar

mahesh babu, srinu vaitla, telugu film nagar, tollywood news, srimanthudu movie, bramhotsavam movie, mahesh babu gossips, g entertainments private limited, mahesh babu movies, mahesh babu photo shoot, mahesh babu family members

mahesh babu srinu vaitla production house tollywood film nagar : Tollywood prince Mahesh Babu and Director Srinu Vaitla Making A Plan to Built Their Own Production House. According to telugu film nagar talk a movie will come soon in their banner.

నిర్మాణ రంగంలో ‘దూకుడు’ జంట అదిరేనా?

Posted: 06/11/2015 10:56 AM IST
Mahesh babu srinu vaitla production house tollywood film nagar

ఇండస్ట్రీలో వున్న కొందరు నటీనటులు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సొంతంగా బ్యానర్లు ఏర్పరుచుకుంటున్న వైనాన్ని అందరం చూస్తున్నాం! తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ లిస్టులో చేరిపోయిన విషయం తెలిసిందే! ఇటీవలే మహేష్ ‘జి.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పాడు. తన కుటుంబానికి ఓ బ్యానర్ వున్నప్పటికీ.. మహేష్ తనకంటూ ఈ బ్యానర్ ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈ బ్యానర్ పై ఆయన ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే.. మహేష్ బాబు నిర్మాతగా తన కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు వైట్లతో కలిసి చిత్ర నిర్మాణాన్ని చేపట్టడానికి మహేష్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళికల గురించి ఇద్దరూ చర్చించుకున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే వీరి నిర్మాణంలో ఓ సినిమా కూడా రానుందని ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి.. ఇందులో నిజమెంతో తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పష్టం చేయాల్సిందే! ఒకవేళ వీరిద్దరూ ప్రొడక్షన్ హౌస్ పెడితే.. ‘దూకుడు’ సినిమాలాగే బాక్సాఫీస్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ జంట.. నిర్మాణరంగంలో అదే విధంగా కొనసాగుతుందో లేదో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెలువడి కానున్నాయి. అటు దర్శకుడు శ్రీనువైట్ల హీరో రాంచరణ్ తో కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  srinu vaitla  telugu film nagar  

Other Articles