Raghu karumanchi | Producer | Interview

Raghu karumanchi wants to become producer with ntr film

Raghu karumanchi wants to produce ntr film, Raghu karumanchi latest interview, Raghu karumanchi interview, Raghu karumanchi birthday special, Raghu karumanchi latest news, Raghu karumanchi movie news, Raghu karumanchi movie updates, Raghu karumanchi stills, Raghu karumanchi

Raghu karumanchi wants to become producer with ntr film: Comedian Raghu karumanchi Birthday today. Wish him a very happy birthday. he wants to produce ntr film.

ఎన్టీఆర్ సినిమాతోనే నిర్మాతగా ఎంట్రీ ఇస్తాడట!

Posted: 05/12/2015 10:23 AM IST
Raghu karumanchi wants to become producer with ntr film

తెలుగులో కమెడియన్ గా, నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రఘు కరుమంచి త్వరలోనే నిర్మాతగా మారనున్నాడట. అవును.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఈరోజు రఘు పుట్టినరోజు. ఈ సంధర్భంగా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది తెలుగు విశేష్.

ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు, ఈవెంట్స్, టీవి షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన రఘు... ఇంకా వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. అయితే తన పుట్టినరోజు సంధర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తాను సినిమా ఇండస్ట్రీకి రావడానికి గల కారణం తన స్నేహితులు వి.వి.వినాయక్, సురేంధర్ రెడ్డిలేనని తెలిపారు. ఎన్టీఆర్ తో వినాయక్ ‘ఆది’ సినిమాలో ఆఫర్ రావడంతో వెంటనే ఒప్పేసుకున్నానని తెలిపాడు.

ఎన్టీఆర్ సినిమాతో ప్రారంభమైన తన సినీ కెరీర్ ప్రస్తుతం చాలా సంతోషంగా నడుస్తోందని, ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని,.. అందుకే భవిష్యత్తులో నిర్మాతగా మారి తన సొంత సొంత బ్యానర్లో ఎన్టీఆర్ తో ఓ సినిమా నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే నిర్మాతగా మారడానికి ఇంకా చాలా సమయం వుందని, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు పవన్ కళ్యాన్, బాలకృష్ణ లతో నటించే అవకాశం రాలేదని, వారితో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని రఘు చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం తాను నటించిన దాదాపు 10 సినిమాల వరకు విడుదలకు సిద్దంగా వున్నాయని, అంతే కాకుండా ప్రస్తుతం రామ్ చరణ్, గోపీచంద్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలలో నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మరి వరుస సినిమాలతో బిజీగా వున్న రఘు త్వరలోనే నిర్మాతగా మారి, ఎన్టీఆర్ తో ఓ మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghu karumanchi  Producer  Birthday special  Interview  

Other Articles