Sneha | pregnant | Prasanna | confirmed

Actress sneha pregnant confirmed by prasanna

Sneha pregnant confirms, Sneha pregnant confirmed, Sneha pregnant news, Prasanna confirms Sneha pregnant news, Sneha latest news, Sneha news, Sneha Prasanna news, Sneha become mother, Sneha movies, Sneha

Actress Sneha pregnant Confirmed by Prasanna: Sneha is pregnant now and this news has been confirmed by her husband prasanna kumar.

ఆ అబద్ధాలను నిజం చేసిన స్నేహ దంపతులు

Posted: 04/14/2015 04:28 PM IST
Actress sneha pregnant confirmed by prasanna

సినీ కెరీర్ కాస్త బాగున్న సమయంలోనే హీరోయిన్ స్నేహ, నటుడు ప్రసన్న కుమార్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘ఉలవచారు బిర్యానీ’ చిత్రంతో స్నేహ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ఉపేంద్రకు భార్య పాత్రలో స్నేహ నటించింది.

గతకొద్ది కాలంగా సినీ నటి స్నేహా గర్భవతి అంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్నేహ ఇటీవలే ఖండించింది. కానీ త్వరలోనే స్నేహ తల్లి కాబోతుందని, స్నేహ భర్త ప్రసన్న కుమార్ తెలియజేసాడు.

అయితే స్నేహ ఇక మరో ఏడాది వరకు సినిమాలు చేయదని అర్థమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం స్నేహ గర్భవతిగా వుందని ప్రసన్న కుమార్ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు. ‘ఈ స్పెషల్ రోజున మీ అందరితో ఓ శుభవార్త పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఇంట్లోకి మరో కొత్త మెంబర్ వస్తాడు. దానికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం’ అని ప్రసన్న ట్వీట్ చేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sneha  pregnant  Prasanna  confirmed  

Other Articles