Jilla | telugu movie rights | Release date

Jilla movie telugu rights acquired sri obuleswara productions

Jilla movie telugu rights, Jilla movie release date, Jilla telugu movie news, Jilla telugu movie updates, Jilla telugu movie stills, Jilla telugu movie posters, Jilla telugu movie

Jilla movie telugu rights acquired sri obuleswara productions: Tamil star hero Vijay block buster movie Jilla telugu movie rights acquired sri obuleswara productions.

జిల్లా తెలుగు హక్కులు సొంతం... త్వరలోనే విడుదల

Posted: 04/14/2015 05:36 PM IST
Jilla movie telugu rights acquired sri obuleswara productions

తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిల్లా’ చిత్రం తెలుగు హక్కులను తీవ్ర పోటీ నడుమ ‘శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌’ సొంతం చేసుకొంది. తెలుగు`తమిళ భాషల్లో తిరుగులేని ‘మెగా ప్రొడ్యూసర్‌’గా వెలుగొందుతున్న ఆర్‌.బి.చౌదరి సమర్పణలో.. తన మిత్రుడు ప్రసాద్‌ సన్నిధితో కలిసి యువ నిర్మాత తమటం కుమార్‌రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నామన శంకర్‌రావు ఈ చిత్రానికి సహ నిర్మాత. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, క్రేజీ కథానాయకి కాజల్‌, డా॥బ్రహ్మానందం, ఎల్‌.బి.శ్రీరాం, సురేఖావాణి, ప్రదీప్‌రావత్‌, సంపత్‌రాజ్‌ ముఖ్య తారాగణంగా ఆర్‌.టి.నేసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళనాట కాసుల వర్షం కురిపించి 120 కోట్లకు పైగా వసూలు చేసి, విజయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ చిత్రం గురించి నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి ప్రసాద్‌ సన్నిధి మాట్లాడుతూ.. ‘‘ఆర్‌.బి.చౌదరి వంటి లెజండరీ ప్రొడ్యూసర్‌ సమర్పణలో ‘జిల్లా’ చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ కోసం ఎందరో టాప్‌ ప్రొడ్యూసర్స్‌ పోటీ పడినప్పటికీ.. మాలాంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం, మరియు మా మీద గల నమ్మకంతో ‘జిల్లా’ తెలుగు హక్కులు మాకు ఇవ్వడమే కాకుండా.. ఈ చిత్రాన్ని తెలుగులో మాతో కలిసి సమర్పించేందుకు పెద్ద మనసుతో అంగీకరించిన ఆర్‌.బి.చౌదరిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. డా॥బ్రహ్మానందం, ఎల్‌.బి.శ్రీరాం, సురేఖావాణి తదితరులపై తెలుగు వెర్షన్‌ కోసం కొన్ని సన్నివేశాల్ని ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఈ చిత్ర హీరోలు విజయ్‌, మోహన్‌లాల్‌, ముఖ్యపాత్రధారులు ప్రదీప్‌రావత్‌, సంపత్‌రాజ్‌ తదితరులు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు కావడం తెలిసిందే. ఇక హీరోయిన్‌ కాజల్‌కు తెలుగులో గల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌.బి.చౌదరిగారి తనయుడు, తమిళ రైజింగ్‌స్టార్‌ జీవా ఈ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్ర పోషించడం విశేషం. త్వరలో ఈ చిత్రం తెలుగు టైటిల్‌ను అనౌన్స్‌ చేయనున్నాం’ అన్నారు.

మహత్‌ రాఘవేంద్ర, నివేదా థామస్‌, సూరి, పూర్ణిమా భాగ్యరాజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: గణేష్‌ రాజవేలు, ఎడిటింగ్‌: డాన్‌ మ్యాక్స్‌, మ్యూజిక్‌: డి.ఇమాన్‌, పాటలు: వెన్నెలకంటి, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, నిర్మాతలు: తమటం కుమార్‌రెడ్డి`ప్రసాద్‌ సన్నిధి, సహనిర్మాత: నామన శంకర్‌రావు, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, నిర్మాణ సంస్థలు: సూపర్‌గుడ్‌ ఫిలింస్‌`శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఆర్‌.టి.నేసన్‌!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jilla  telugu movie rights  Release date  stills  

Other Articles