Thaman special song for surya mass movie

Thaman special mass song for surya mass movie, Thaman special mass song for mass, Thaman special mass song for surya, Thaman mass song for surya, Thaman special song for mass, surya mass movie news, surya mass movie updates, surya mass movie looks, surya mass movie posters, surya mass movie stills

Thaman special song for surya mass movie: Actor Surya latest movie Mass. yuvan shankar raju music director. thaman guest composer.

సూర్య కోసం థమన్ మాస్ సాంగ్

Posted: 03/19/2015 11:44 AM IST
Thaman special song for surya mass movie

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్’. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన సూర్య లుక్స్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇందులోని ఓ సాంగ్ కోసం థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఓ మాస్ పాటకు థమన్ కంపోజ్ చేసాడు. మాస్ మసాలా, ఐటెం నెంబర్ గా ఈ పాట వుండనుందని, తీన్ మార్ స్టెప్పులతో వుండే విధంగా థమన్ ఈ పాటను కంపోజ్ చేసినట్లుగా తెలిసింది.

ఈ పాటను ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో వేసిన భారీ స్పెషల్ సెట్ లో షూట్ చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ పూర్తి చేసుకొని, ఏప్రిల్ రెండవ వారంలో ఆడియో విడుదల చేసి, మే 1వ తేదిన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా పాటలు హిట్టవుతాయో లేక థమన్ ఐటెం సాంగ్ హిట్టవుతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thaman  mass song  surya  mass movie  

Other Articles