Actress poorna fires on malayalam directors

poorna news, poorna hot photos, poorna latest news, poorna controversy, poorna photo shoot, poorna statements, poorna gallery, poorna interview, poorna press meet, poorna movies, poorna

actress poorna fires on malayalam directors : Actress poorna makes controversial comments on malayalam directors for not giving movie offers to talented heroines.

మలయాళ దర్శకులపై కస్సుబుస్సుమన్న పూర్ణ

Posted: 03/19/2015 12:04 PM IST
Actress poorna fires on malayalam directors

‘అవును’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లూ బ్యూటీ పూర్ణ.. మలయాళ దర్శకులపై మండిపడింది. తెలుగు, తమిళంలో నటిగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నఈ అమ్మడికి.. తన పుట్టినిల్లైన మలయాళంలో మాత్రం అంతగా ఆఫర్లు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు అక్కడి దర్శకుల మీద తన ఆగ్రహం వ్యక్తం చేసింది.

మలయాళంలో ప్రతిభ వున్న ఎందరో హీరోయిన్లు వున్నప్పటికీ.. వారిని మాత్రం సినిమాల్లో తీసుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి వేరేవాళ్లను పిలిపించుకుని మరీ అవకాశాలు ఇవ్వడం దారుణమంటూ దర్శకులపై కోపంగా వుంది పూర్ణ! మలయాళంలో ఈ అమ్మడు నటించింది కేవలం రెండు సినిమాలు మాత్రమే! అనంతరం మూవీ ఆఫర్ల కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ.. అక్కడి దర్శకులు ఈమెకు అవకాశం ఇవ్వలేదు. కానీ.. ఐటెం సాంగుల్లో నటించమని ఎందరినుంచో పిలుపు వచ్చిందట! ఈ క్రమంలోనే అక్కడ ఓ ఐటెంసాంగులో నృత్యించింది కానీ.. ఆ తర్వాత అటువంటివే ఎక్కువగా రావడంతో అమ్మడికి చిరాకు వచ్చి.. అక్కడి నుంచి వచ్చేసిందని చెబుతోంది. మరి.. ఈమె చేసిన కామెంట్లకు మలయాళ దర్శకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. పూర్ణ తెలుగులో ‘సీమ టపాకాయ్, లడ్డుబాబు, అవును, అవును 2’లతోపాటు మరిన్ని సినిమాల్లోనూ నటించింది. అటు తమిళంలో కూడా అడపాదడపా ఆఫర్లు దక్కించుకుంటూ తన కెరీర్ ని కొనసాగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : poorna  malayalam directors  tollywood news  

Other Articles