Ranbir kapoor anushka sharma bombay velvet movie trailer released

bombay velvet movie, ranbir kapoor news, anushka sharma news, bombay velvet movie updates, bombay velvet movie news, bombay velvet photos, anurag kashyap, karan johar news, anushka sharma love affairs

ranbir kapoor anushka sharma bombay velvet movie trailer released : Bollywood young star ranbir kapoor and sexy beauty anushka sharma latest flick bombay velvet trailer released which is directed by anurag kashyap.

‘బాంబే వెల్వెట్’ ట్రైలర్ లో కపూర్-శర్మల ముద్దుల పండగ!

Posted: 03/19/2015 11:08 AM IST
Ranbir kapoor anushka sharma bombay velvet movie trailer released

బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్ బీర్ కపూర్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ‘బాంబే వెల్వెట్’ చిత్రం రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా సెక్సీ నటి అనుష్క శర్మ నటిస్తుండగా.. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని కశ్యప్ నిర్మాణ సంస్థ ఫాంటమ్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రముఖ రచయిత గ్యాన్ ప్రకాష్ రచించిన ‘ముంబై ఫేబుల్స్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది.

ఇదిలావుండగా.. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్ని ఆసక్తిపరిచేలా వుండటంతో వాటికి మంచి స్పందనే లభించింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లోనే కథ దాదాపుగా రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. 1960 కాలంనాటి ఈ కథకు సంబంధించిన ఈ మూవీలో రణ్ బీర్ ఓ బాక్సర్ (జానీ బలరాజ్) పాత్రలో నటిస్తుండగా.. అనుష్క సింగర్ (రోసీ) పాత్రలో నటిస్తోంది. తమ కలలను సాకారం చేసుకుని నేపథ్యంలో అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఇక వీరి జీవితంలో మరికొందరు జతవుతారు. ఇక అక్కడి నుంచి కష్టాలు, కలహాలు.. అన్ని తోడవుతాయి. చివరికి వాళ్లు తమ గమ్యాన్ని చేరుతారో..? లేదా..? అన్న కోణంపై ఈ మూవీని అనురాగ్ కశ్యప్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఎంతో ఆసక్తికరంగా, చిత్రంపై అంచనాలు పెరిగే విధంగా వున్న ఈ ట్రైలర్ లో రణ్ బీర్ - శర్మల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలున్నాయి. ట్రైలర్ లోనే ఇంత ఘాటుగా వుండగా.. మొత్తం సినిమాలో వీరిమధ్య ఇంకెన్ని ఇంటిమేట్ సన్నివేశాలుంటాయోనని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని మే 15వ తేదీన విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bombay velvet movie  ranbir kapoor  anushka sharma  karan johar  anurag kashyap  

Other Articles