Rakul preet singh ready to do liplock scenes

rakulpreetsingh, liplock, rakul hot photos, rakul wallpapers, rakul photoshoot, rakul hd images, rakul cinemas, rakul actor, rakul cute images

rakul preet singh ready to do liplock scenes. telugu actrcess, punjabi beauty rakul preet singh clear that she dont have any objection for liplock. on demand of cinema story she is ready for do so.

అందుకూ సిద్దమే అంటున్న రకుల్

Posted: 03/18/2015 10:04 AM IST
Rakul preet singh ready to do liplock scenes

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో పెద్ద హిట్ అందుకున్న రకుల్‌ప్రీత్‌సింగ్ వరుస ఆఫర్స్‌తో స్టార్ హీరోలతో జతకడుతోంది. చిన్న సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు నెంబర్‌వన్ రేసులో రకుల్ ప్రీత్ సింగ్ ముందజలో ఉంది. గ్లామర్, యాక్టింగ్ ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తు  ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సుందరి ఇక సినిమా కోసం దేనికైనా సిద్దమని అంటోంది. సినిమా కథ డిమాండ్ చేస్తే అందుకు కూడా తాను సిద్దమే అంటోంది ఈ పంజాబి బ్యూటి. గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల మదిని దోచిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు అన్నింటికి సిద్దమని బాహాటంగానే చెబుతోంది.

సినిమాలో కథకు ఎంత ప్రాధాన్యత ఉన్నా,కాస్తైనా గ్లామర్ టచ్ లేకపోతే బోరుమంటున్నారు కుర్రకారు. అందుకే ఈ మధ్య తెలుగు సినిమాల్లో మసాలాను జోడిస్తున్నారు దర్శకులు. అందుకే కుదిరితే ఓ లిప్ లాక్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నడుస్తున్న లిప్ లాక్ ట్రెండ్ పై రకుల్ ప్రీతి సింగ్ కూడా ఇంట్రస్ట్ గా ఉన్నట్లుంది. అందుకే కథ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అంటోంది.

పైగా లిప్ లాక్ లు సినిమాలో ఓ భాగం మాత్రమేనని,  వాటికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. కథలో అంతర్భాగంగా లిప్‌లాక్‌లు ఉంటే వాటిలో నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదని. అయితే ఆ సన్నివేశాలు అశ్లీలత లేకుండా చక్కటి సృజనాత్మకతను ప్రతిబింబించేలా వుండాలి అంటోంది. అంతేకానీ కథకు అవసరం లేకపోయినా ప్రచారం కోసమో, సినిమాకు క్రేజ్ తీసుకురావటానికో ఇటీవల కాలంలో సినిమాల్లో లిప్‌లాక్‌కు చోటుకల్పిస్తున్నారని రకుల్ అంది. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వాటిలో నటించడానికి నాకు ఇష్టం ఉండదు. వాటికి నేను దూరం అని రకుల్‌ప్రీత్‌సింగ్  తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakulpreetsingh  liplock  rakul hot photos  rakul wallpapers  rakul photoshoot  

Other Articles