Ravi teja bengal tiger movie release date updates

bengal tiger movie, ravi teja bengal tiger, ravi teja tamanna, ravi teja latest news, ravi teja movies, ravi teja latest flick, mass maharaja ravi teja news, ravi teja bengal tiger movie updates, bengal tiger movie updates, tamannah bhatia news, tamannah hot photos, tamannah hot photo shoot, rashi khanna news, rashi khanna hot photos

ravi teja bengal tiger movie release date updates : Ravi teja Latest Flick Bengal tiger movie producer and director has announced the official release date of this movie. They are planning to release this flick on september 18.

వినాయకుడిని బుక్ చేసుకున్న ‘బెంగాల్ టైగర్’

Posted: 03/14/2015 04:50 PM IST
Ravi teja bengal tiger movie release date updates

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కిక్-2’ మూవీ చిత్రీకరణలో ఫుల్ బిజీగా వున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తికాగానే రవి తన తదుపరి చిత్రం ‘బెంగాల్ టైగర్’ చేయనున్నాడు. ఇటీవలే గ్రాండ్ గా ముహూర్త కార్యక్రమాలను జరుపుకున్న ఈ మూవీలో రవితేజ సరసన మిల్కీబ్యూటీ తమన్నా, స్మైలింగ్ సుందరి రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘రచ్చ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

ఇదిలావుండగా.. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్టుతో తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చి 14తో ఓ షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. అనంతరం ఏప్రిల్ 9వ తేదీ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న అనంతరం ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విడదుల తేదీని స్వయంగా నిర్మాత రాధామోహన్ వెల్లడించారు. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఇక ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప్రభు, ప్రగ‌తి, నాగినీడు, ర‌మాప్రభ తదిత‌రులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే.. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించిన బాలీవుడ్ బెస్ట్ ఆర్టిస్ట్ బోమ‌న్ ఇరాని ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles