మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి చిరు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ‘మగధీర’తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ ‘ఆరేంజ్’ బుల్లోడు.. ‘గోవిందుడై’ అందరివాడయ్యాడు. ప్రస్తుతం ఇతను ‘మై నేమ్ ఈజ్ రాజ్’ అంటూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే ఓ బాలీవుడ్ మూవీలో కూడా కనువిందు చేయనున్నాడని సమాచారం!
ఇదిలావుండగా.. చెర్రీ తాజాగా ఓ కోరికను వెల్లడించాడు. ఇతర భాషా చిత్రాల్లో నటించడం గురించి అడిగితే.. తనకు ఓ కన్నడ సినిమాలో నటించాలని వుందని వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే చెర్రీ మాట్లాడుతూ.. ‘‘నాకు కన్నడ సినిమాలో నటించాలని వుంది. ఓ ప్రత్యేక పాత్రయినా చేస్తాను. ఈమధ్య నేను చూసిన కన్నడ సినిమాలలో ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించమంటూ ఆఫర్ కూడా వచ్చింది కానీ.. రీమేక్స్ చేయకూడదన్న ఉద్దేశంతో ఆ మూవీని అంగీకరించలేదు’’ అని స్పష్టం చేశాడు.
ఇంకో విషయం ఏమిటంటే.. ఈ మెగా హీరో బెంగుళూర్ సమీపంలో ఓ ఫామ్ హౌస్ లో వుంటున్నాడు. ఒక రిమోట్ ఏరియాలో సకల సదుపాయాలతో నిర్మితమైన ఈ ఫామ్ హౌస్ ను చిరంజీవి పదిహేనేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. ఈ క్రమంలో చెర్రీ అక్కడే సేద తీర్చుకుంటున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఫామ్ హౌస్ ఎదురుగానే రజనీ ఫామ్ హౌస్ కూడా వుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more