Puri jagannadh house robbed jubileehills police station

puri jagannadh news, puri jagannadh house, puri jagannadh house robbed, puri jagannadh family members, director puri jagannadh updates, puri jagannadh house robbed news, puri jagannadh family members news, puri jagannadh photos, puri jagannadh gallery, puri jagannadh wife, puri jagannadh son, puri jagannadh daughter

puri jagannadh house robbed jubileehills police station : Tollywood top director puri jagannadh house robbed on friday while his family members not in home. When they reached back.. they recognized that their house were robbed.

పూరీ జగన్నాథ్ ఇంటిని దోచేసిన దొంగలు...

Posted: 03/14/2015 11:12 AM IST
Puri jagannadh house robbed jubileehills police station

ఇటీవలే ‘టెంపర్’ సినిమాతో సక్సెస్ సాధించి ఫుల్ హ్యాపీగా వున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ కి వ్యక్తిగతంగా చేదు అనుభవం ఎదురైంది. ఇతని ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు 15 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాలతో పొదిగిన నెక్లెస్‌ చోరీకి గురయ్యాయి. ఇదే విషయమై ఆయన శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.31లో పూరి జగన్నాథ్ ఫ్యామిలీ నివాసముంటోంది. శుక్రవారం ఇతను తన కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో.. ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. బెడ్‌రూమ్‌లో వున్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగిలించారు. పూరీ కుటుంబం తిరిగి ఇంటికి వచ్చేసరికి రూమ్ తాళాలు తెరిచివుండడం, బంగారు ఆభరణాలు కనిపించకపోవడం గమనించిన ఆయన.. వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేశారు.

దీంతో పూరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారణ చేపట్టారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చోరీ జరగడంతో.. ఈ దొంగతనాన్ని పూరీకి తెలిసినవాళ్లే ఎవరో చేసి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు ఇంట్లో పనిచేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles