Nikhil kona venkat shankarabharanam crime comedy bihar movie

nikhil news, hero nikhil news, hero nikhil photos, hero nikhil movie, hero nikhil photo shoot, writer kona venkat, kona venkat news, kona venkat movies, kona venkat controversy, kona venkat movies list, kona venkat nikhil movie, kona venkat nikhil updates, kona venkat scripts, tollywood news, kona venkat twitter, nikhil twitter

nikhil kona venkat shankarabharanam crime comedy bihar movie : Tollywood script writer turned producer is making new project with hat trick hero nikhil. This movie title is fixed as shankarabharanam which is based on bihar's crime story.

నిఖిల్ - కోన వెంకట్ ల ‘బీహార్’ శంకరాభరణం!

Posted: 03/14/2015 11:08 AM IST
Nikhil kona venkat shankarabharanam crime comedy bihar movie

తెలుగు చిత్రపరిశ్రమలో ఏడాదికాలంలో ఇబ్బడిముబ్బడిగా ఎన్నో సినిమాలు వస్తుంటాయి. ఈ మూవీల మధ్య తమకూ, తమ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం కొంతమంది యువహీరోలు వెరైటీ కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అటువంటి హీరోల్లో ‘హ్యాపీడేస్’ ఫేం నిఖిల్ ప్రస్తుతం ముందున్నాడు. ఇదివరకే ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న ఈ నటుడు.. ఇటీవలే ‘సూర్య వర్సెస్ సూర్య’ వంటి మరో ప్రయోగాత్మక చిత్రంతో విజయం సాధించి హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ హీరో మరో క్రైమ్ కామెడీ కథతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడని తెలిసింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సినీ రచయిత కోనవెంకట్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఆయన నిర్మాతగా ‘గీతాంజలి’ వంటి హిట్ సినిమాని ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు తాజాగా తన నిర్మాణంలో మరో మూవీని తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. వరుస హిట్లతో హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖి‌ల్ తో కలిసి తాను సినిమా చేస్తున్నట్లుగా స్వయంగా పేర్కొన్నారు. తమ కాంబోలో రూపొందే సినిమా ‘బీహార్’ నేపథ్యంలో క్రైమ్ కామెడీ చిత్రంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందిస్తూ.. కోనవెంకట్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఇదే విషయాన్ని కోనవెంకట్ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు. తమ సంస్థలో నిఖిల్‌ హీరోగా ‘శంకరాభరణం’ పేరుతో సినిమా తీస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. పూర్తి క్రైమ్ కామెడీ కథగా ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన తెలిపారు. ప్రవీణ్ లక్కిరాజు సంగీతం సమకూర్చనున్నారు. ఇందులో ఇంకా కథానాయిక ఎవరనే విషయం ఖరారు కాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kona venkat  hero nikhil  tollywood news  

Other Articles