Rajinikanth latest flick director muragadoss producer aascar ravichandran kollywood gossips

rajinikanth news, rajinikanth movie updates, rajinikanth latest updates, rajinikanth movie news, rajinikanth controversy, rajinikanth linga controversy, rajinikanth tamil movies, director ar muragadoss, ar muragadoss latest flick, i movie news, i movie producer, aascar ravichandran news, aascar ravichandran latest flicks, aascar ravichandran gossips, kollywood gossips, telugu news, telugu movie news websites

rajinikanth latest flick director muragadoss producer aascar ravichandran kollywood gossips : The Rumours are going viral in kollywood that super star rajinikanth is doing his next project with ghajini fame muragadoss. I movie producer aascar ravichandran will produce this.

‘ఐ’.. గజినీతో జతకట్టిన రజినీ!

Posted: 03/14/2015 11:02 AM IST
Rajinikanth latest flick director muragadoss producer aascar ravichandran kollywood gossips

‘రోబో’ మూవీ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కొచ్చాడయాన్’, ‘లింగ’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈసారి తన అభిమానులకు ఓ జబర్దస్త్ హిట్ ఇవ్వాలని ఉద్దేశంతో రజినీ ఓ బ్లాక్ బస్టర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రాన్ని ‘గజినీ’ ఫేం దర్శకుడు మురగదాస్ తో కలిసి తీయాలని రజినీ భావిస్తున్నట్లుగా కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ.. సినీవర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో త్వరలోనే ఓ మూవీ రూపొందనున్నట్లు జోరుగా వార్తలు కొనసాగుతున్నాయి.

ఇటీవలే మురగదాస్ తెరకెక్కించిన ‘కత్తి’ సినిమా కోలీవుడ్ లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఆ మూవీ 100 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. అంతేకాదు.. ఈ మూవీకన్నా ముందు ఈ దర్శకుడు తమిళం, హిందీలో తీసిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో.. ఇతనితో కలిసి సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని రజనీ భావించారట! పైగా.. ఇతనికి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మురగదాస్ తో కలిసి ఓ మూవీ తీయాలనకున్నట్లు తెలుస్తోంది. ఇక రజనీతో కలిసి సినిమా తీయాలని ఎప్పటినుంచో మురగదాస్ అనుకున్నప్పటికీ.. గతంలో ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు స్వయంగా రజనీ ముందుకు వచ్చి అతనితో కలిసి మూవీ తీసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ గజనీ ఫుల్ హ్యాపీగా వున్నాడని అంటున్నారు.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందే మూవీని ‘ఐ’ సినిమాను భారీ బడ్జెట్టుతో నిర్మించిన నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మురగదాస్ బాలీవుడ్ సెక్సీ తార సోనాక్షీ సిన్హాతో కలిసి లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే.. గజనీ, రజనీ, ఐ కాంబినేషన్ లో మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే.. మరిన్ని రోజులు ఆగాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  aascar ravichandran  director ar muragadoss  kollywood gossips  

Other Articles