Mahesh babu srimanthudu overseas rights koratala siva shruti hassan classics entertainments

mahesh babu, srimanthudu movie news, mahesh babu srimanthudu, srimanthudu latest news, srimanthudu movie gallery, srimanthudu movie updates, mahesh babu latest updates, shruti hassan news, shruti hassan photos, classics entertainments, koratala siva news

mahesh babu srimanthudu overseas rights koratala siva shruti hassan classics entertainments : mahesh babu latest flick sreemanthudu overseas rights has sold with highest rate. It has been sold by classics entertainements with 8.1 crore.

ఓవర్సీస్ రికార్డును బ్రేక్ చేసిన ‘శ్రీమంతుడు’!

Posted: 03/12/2015 05:00 PM IST
Mahesh babu srimanthudu overseas rights koratala siva shruti hassan classics entertainments

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ పేరిట మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే! ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కువున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా వేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించి ఇంతవరకు టీజర్ గానీ, ఫస్ట్ లుక్స్ గానీ ఇంకా విడుదల కాలేదు కానీ.. దీని ఓవర్సీస్ ప్రదర్శన హక్కులు మాత్రం రికార్డు ధరకు అమ్మడుపోయాయని తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం.. క్లాసిక్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ మూవీ ఓవర్సీసస్ హక్కులను 8.1 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. విదేశీ ప్రదర్శన హక్కులకు సంబంధించి ఇది ఒక సరికొత్త రికార్డనే చెప్పాలి. ఎందుకంటే.. ఇంతవరకు మరే ఇతర తెలుగు సినిమా ఇంత మొత్తానికి అమ్ముడుపోలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. మహేష్ నటించిన ‘నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటి భారీగా ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ ప్రభావం అతని సినిమాల బిజినెస్ పై ఏమాత్రం చూపడం లేదని చెప్పవచ్చు. పైగా.. ‘శ్రీమంతుడు’ ఫ్యామిలీకథా నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి ఖచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందనే నమ్మకంతో ఓవర్సీస్ రైట్స్ ని ఈ రేంజిలో కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

ఇదిలావుండగా.. ఓవర్సీస్ లో ఇంతవరకు అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ ప్లేస్ లో వుండగా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రెండో స్థానంలో వుంది. మరి.. ‘శ్రీమంతుడు’ ఆ రెండు సినిమాల రికార్డును బ్రేక్ చేస్తాడా..? లేదా..? వేడి చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sreemanthudu movie  mahesh babu  classics entertainments  shruti hassan  overseas rights  

Other Articles