Milky beauty tamanna bhatia 10 years completed in cine industry

tamanna bhatia, tamanna latest news, tamannah hot photos, tamannah latest interview, tamannah photo gallery, tamannah press meet, tamannah photo session, tamannah movies

milky beauty tamanna bhatia 10 years completed in cine industry : Milky beauty tamanna feeling exciting for completing ten years in film industry. she is saying that her cine career has satisfied her more.

ఎక్కడికెళ్లినా మిల్కీబ్యూటీకి సంతృప్తేనట!

Posted: 03/12/2015 08:02 PM IST
Milky beauty tamanna bhatia 10 years completed in cine industry

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలన్నింటిలోనూ ప్రధాన పాత్ర హీరోలదే! నటన, డ్యాన్స్, ఫైటింగ్... ఇలా అన్నింటిలోనూ హీరో ఒక్కడే రాణిస్తాడు కాబట్టి.. అతడిదే పైచేయి అవుతుంది. అదే హీరోయిన్ విషయానికొస్తే.. వాళ్లు తమ గ్లామర్ ను ఆరబోయడం తప్ప తమ టాలెంట్ ని నిరూపించుకునే అవకాశం చాలా తక్కువ! ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అయితే కథానాయికల పాత్ర అంతంత మాత్రమే వుంటుంది.

కానీ ఈ విషయంలో మాత్రం తనకు అటువంటి అసంతృప్తి లేదని మిల్కీబ్యూటీ తమన్నా వెల్లడిస్తోంది. ఇప్పటివరకు తాను నటించిన సినిమాలన్నింటిలోనూ తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం లభించిందని, అలాగే నటించబోయే మూవీల్లోనూ తన పాత్ర ప్రేక్షకుల్ని మెప్పించేలా వుంటుందని అమ్మడు చెబుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా వున్న ఈ బ్యూటీ.. అన్నిరంగాల్లోనూ తనకు సంతృప్తి కలిగే పాత్రలే లభించాయని సంతోషంగా చెబుతోంది.

మిల్కీబ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తన సినీప్రయాణం తనకు సంతృప్తి కలిగించిందా..? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘నా కెరీర్ లో నాకెప్పుడు అసంతృప్తి లేదు. పది మందికి గర్వంగా నేను మంచి పాత్రల్లో నటించానని చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు ఉన్నాయి. కేవలం సక్సెస్ అనే టార్గెట్ పెట్టుకొని నేనెప్పుడు సినిమాలు చేయలేదు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పించాలి, కొత్తగా కనిపించాలనే సినిమాలు చేసాను. నా పదేళ్ళ సినీ ప్రయాణం నాకు చెప్పలేనంత ఆనందం ఇచ్చింది’ అని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamannah bhatia  indian film industry  

Other Articles