Naga shourya jadoogadu movie release on april

Naga Shourya Jadoogadu Movie Release on April, Jadoogadu Movie First Look Poster, Jadoogadu First Look Poster Released, Jadoogadu movie news, Jadoogadu first look poster, Jadoogadu movie shooting, Jadoogadu movie news, hero naga shourya, hero naga shourya movie, naga shourya news, naga shourya Jadoogadu movie, naga shourya movie updates

Naga Shourya Jadoogadu Movie Release on April: The first look poster of latest telugu movie Jadoogadu released on holi festival 2015. hero naga shourya playing in lead role. Yogesh direction.

ఏప్రిల్ లో జాదుగాడిగా నాగశౌర్య ఎంట్రీ

Posted: 03/10/2015 12:07 PM IST
Naga shourya jadoogadu movie release on april

‘చింతకాయల రవి’ ఫేం దర్శకుడు యోగేష్ దర్శకత్వంలో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘జాదుగాడు’ అనే ఓ చిత్రం రూపొందుతోంది. ‘ఊహలు గుసగుస లాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయవంతమైన చిత్రాల యువహీరో ‘నాగ శౌర్య’ హీరోగా, ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన సోనారిక ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

చిత్ర దర్శకుడు యోగేష్ మాట్లాడుతూ... కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమకధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రంలోఅతని పాత్ర, గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రంలో కధానాయకుడి పాత్రను తీర్చిదిద్దటం జరిగింది. వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ ‘జాదూగాడు’ అని అన్నారు.

పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ ‘జాదూగాడు’ షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ నెలలోనే చిత్రం ఆడియో, ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.

కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ,‘అదుర్స్’ రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్, ఎడిటర్: యం.ఆర్.వర్మ, ఆర్ట్: సాహి సురేష్,  ఫైట్స్: వెంకట్, కథ-మాటలు: మధుసూదన్, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, నిర్మాత: వి.వి.ఎన్.ప్రసాద్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం : యోగేష్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jadoogadu  First Look Poster  Naga Shourya  

Other Articles