Nagarjuna multistarrer movie shooting updates

Nagarjuna karthi multistarrer movie shooting updates, Nagarjuna Vamsi Paidipalli Movie Officially Lauched, Gopi sunder music for Nagarjuna Karthi multistarrer, Shruti Hassan in Nagarjuna movie, Shruti Hassan in Karthi multistarrer, Nagarjuna Karthi movie, Shruti Hassan latest movie news, Gopi sunder, Nagarjuna, Karthi, multistarrer, Vamshi paidipally

Nagarjuna multistarrer movie shooting updates: Nagarjuna, Karthi act in a multistarrer movie, vamshi paidipally direction. shruti hassan heroine.

చెన్నైలో నాగార్జున మల్టీస్టారర్ షూటింగ్

Posted: 03/10/2015 11:54 AM IST
Nagarjuna multistarrer movie shooting updates

అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘ఎవడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్లో నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులు మరియు చిత్ర యూనిట్ లతో పాటు హీరో కార్తీ కూడా పాల్గొన్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది. కార్తీ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.

ఈ నెల 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ చెన్నయ్ లో జరుగనుంది. ఇందుకోసం చెన్నయ్ లోని ఈసీఆర్ రోడ్డు సమీపంలో ఓ ప్రత్యేకమైన సెట్ కూడా ఏర్పాటు చేసారు. మొదటి షెడ్యూల్ చెన్నయ్ లో జరిపి ఆ తర్వాత హైదరాబాద్, మరియు విదేశాలలో షూటింగ్ జరుపనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  karthi  multistarrer  movie shooting  

Other Articles