Sanghavi reentry kollanji tamil movie kollywood news

sanghavi news, sanghavi hot photos, sanghavi latest updates, sanghavi videos, sanghavi hot videos, sanghavi updates, sanghavi movie updates, sanghavi kollanji movie, sanghavi gallery, sanghavi photo shoot, sanghavi tamil movie, sanghavi kollywood news, sanghavi

sanghavi reentry kollanji tamil movie kollywood news : The Hot actress sanghavi is coming back on silver screen with kollanji tamil movie. In this movie she is playing a special role which is base to this cinema.

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన హాట్ ఆంటీ!

Posted: 03/10/2015 12:18 PM IST
Sanghavi reentry kollanji tamil movie kollywood news

ఒకప్పుడు నటి సంఘవి తన అందచందాలతో దక్షిణాది సినీపరిశ్రమను ఓ ఊపు ఊపేసింది. చాలావరకు తెలుగులో ప్రముఖ హీరోల సరసన నటించిన ఆమె.. అప్పట్లో హాట్ హీరోయిన్ గా పేరుగాంచింది. ఓవైపు ఫ్యామిలీ కథాచిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను కనువిందు చేసింది. అయితే.. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఆమె.. అరకొర సినిమాల్లో ప్రత్యేక, గెస్టు పాత్రల్లో నటించింది. కానీ.. అవి ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఈ దెబ్బతో ఆమెకు అవకాశాలు రాకపోవడంతో ఇంటిపట్టునే వుంటూ జీవితం కొనసాగించింది. అయితే.. ఇప్పుడు చాలాకాలం తర్వాత ఈమె మళ్లీ వెండతెరపై వస్తోందని సమాచారం!

తమిళంలో ఆమధ్య ‘మూదర్ కూడం’ అనే చిత్రాన్ని రూపొందించిన నవీన్ దర్శకత్వంలో తాజాగా ‘కొలాంజి’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ తమిళ చిత్రంలోనే సంఘవి ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించింది. ఈ మూవీలో సంఘవి సరికొత్తగా కనిపించననుందని, ఆమె పాత్ర ఈ చిత్రానికి ఎంతో ఇంపార్టెంట్ అని దర్శకుడు చెబుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయ్యింది. త్వరలోనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుని చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి. ఇక మూవీతో తనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని సంఘవి ఎన్నో ఆశలు పెట్టుకుని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలావుండగా.. సంఘవి ఈ చిత్రంలో కొన్ని హాట్ సన్నివేశాల్లో కనిపించే అవకాశముందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఆ హాట్ ఇమేజ్ తోనే మంచి అవకాశాలు పొందిన సంఘవి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన మ్యాజిక్ చూపించనుందని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో మూవీ రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanghavi  kollanji tamil movie  kollywood news  

Other Articles