Jeevitha rajasekhar central cencor board members abusing words in movies

Jeevitha Rajasekhar news, jeevitha latest news, jeevitha interview, jeevitha photos, jeevitha press meet, jeevitha photo shoot, jeevitha photo gallery, jeevitha movies, Jeevitha Rajasekhar interview

Jeevitha Rajasekhar central cencor board members abusing words in movies : The member of central cencor board jeevitha rajasekhar said that It is write decision to remove abuse words from the movies.

సినిమాల్లో ఆ తిట్లను తీసేయాల్సిందే!

Posted: 02/27/2015 03:57 PM IST
Jeevitha rajasekhar central cencor board members abusing words in movies

ఇటీవలేకాలంలో వస్తున్న సినిమాల్లో అభ్యంతరకర పదాల వాడకం మరీ ఎక్కువైపోతున్న తరుణంలో వాటిని నిషేధించాలని సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని పదాలను సినిమాల్లో నుంచి తీసేయాలంటూ బోర్డు ఒక మెమో విడుదల చేసింది. అందులో నాయాలా, దొంగ నాయాలా, ముష్టి నాయాలా, చిల్లర నాయాలా, వీపీ, నీ అమ్మ, చెత్త నా కొడకా, గాడిద కొడకా, బొక్క, బొంగు వంటి పదాలను నిషేధిస్తున్నట్లు బోర్డు ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ విషయంపై కొందరు నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదాలపై నిషేధాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలైన జీవిత ఆయా నిర్మాతలు లేవనెత్తిన అభ్యంతరాలను తప్పుపట్టారు. తెలుగు సినిమాల్లో ఆ 30 పదాలను నిషేధించడం సబబేనని అని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యావంతులు తమ దైనందిన జీవితంలో ఈ పదాలను వినియోగించరని, అలాంటప్పుడు ఈ విషయంపై నిర్మాతలు ఎందుకు వివాదం లేవనెత్తుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సినిమాల్లో వినియోగించే ఆ తిట్లు ప్రేక్షకులపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. కాబట్టి.. వాటిని నిషేధించడం కరెక్టేనని ఆమె తెలిపారు. ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ఆమె.. సినిమాల్లో ఆ తిట్లు లేకపోవడమే మంచిదని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jeevitha Rajasekhar news  abuse words in movies  

Other Articles