Pawan kalyan dasari narayanarao movie satyagrahi script

pawan kalyan news, dasari narayana rao news, pawan dasari movie, pawan dasari controversy, pawan dasari hot news, pawan dasari photos, pawan kalyan gabbar singh 2, dasari narayana rao movies, pawan kalyan satyagrahi script

pawan kalyan dasari narayanarao movie satyagrahi script : The news is going viral in tollywood that... dasari narayanarao taking out pawan kalyan dream's project satyagrahi and making movie with him.

పవన్ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ను బయటకు తీస్తున్న దాసరి!

Posted: 02/27/2015 07:13 PM IST
Pawan kalyan dasari narayanarao movie satyagrahi script

ఇటీవలే పవన్ స్టార్ పవన్ కల్యాణ్, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో ఓ సినిమా తెరెకెక్కుతోందన్న వార్త టాలీవుడ్ లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఎందుకంటే.. మెగా ఫ్యామిలీకి, దాసరి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత శత్రుత్వం ఎప్పటినుంచో వుంది కాబట్టి!

అంతెందుకు.. రీసెంట్ గా చెర్రీ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విడుదల నేపథ్యంలో కూడా దాసరి మెగాఫ్యామిలీపై నిప్పులు చెరిగారు. చెర్రీని టార్గెట్ చేస్తూ ఆయన తన మనసులో వున్న ఆవేశాన్ని వారిపై ప్రదర్శించారు. అటువంటి ఆయన ఇప్పుడు మెగాఫ్యామిలీకి చెందిన పవన్ తో సినియా తీయడమేంటి..? అంటూ టాలీవుడ్ తోపాటు పవన్ అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ‘ఇది నిజమేనా?’ అంటూ ఇప్పటికీ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఈ ప్రాజెక్టు అసలు పట్టాలే ఎక్కదని, పవన్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోరంటూ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఆ వార్తలెలా వున్నా.. మరోవైపు దాసరి మాత్రం ఈ సినిమా నిర్మాణ పనుల్లో ఫుల్ బిజీగా వున్నారని సమాచారం! ఇటీవలే పవన్ తో కలిసి మూవీ తీస్తున్నట్లుగా సోషల్ మీడియాలో తెలిపిన ఆయన... అప్పుడే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు.. పవన్ కల్యాణ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘సత్యాగ్రహి’ అనే చిత్రాన్ని అప్పట్లో ప్రారంభించి.. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆపేసిన సంగతి తెలిసిందే! ఇప్పుడు మళ్లీ దానిని బయటకు తీస్తున్నారని, ఆ చిత్రాన్నే దాసరి నిర్మించనున్నారని అంటున్నారు. పైగా.. ఈ చిత్రానికి దర్శకత్వం పవన్ కల్యాణ్ వహిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది.

ఇదిలావుండగా.. ఈ సినిమా విషయంపై పవన్ కల్యాణ్ ఇంతవరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఓవైపు దాసరి మాత్రం తాను పవన్ తో సినిమా తీస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తుండగా.. పవన్ మాత్రం సైలెంట్ గా వున్నారు. రానున్న రోజుల్లో ఈ కాంబినేషన్ మూవీకి సంబంధించి మరెన్ని వార్తలు రానున్నాయో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  dasari narayanarao  pawan dasari movie  satyagrahi script  

Other Articles