Sharwanand merlapaka gandhi uv creations movie updates

sharwanand news, sharwanand merlapaka gandhi, merlapaka gandhi director, sharwanand latest news, sharwanand uv creations, uv creations movies

sharwanand merlapaka gandhi uv creations movie updates : After a long time Venkatadri express movie director merlapaka gandhi to do a movie with hero sharwanand. Uv creations will produce this cinema.

‘ఎక్స్ ప్రెస్’ దర్శకుడికి బ్రేక్ ఇవ్వనున్న శర్వానంద్

Posted: 02/27/2015 01:14 PM IST
Sharwanand merlapaka gandhi uv creations movie updates

సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మేర్లపాక గాంధీ.. ఆ సినిమా ఏ రేంజులో విజయం సాధించిందో అదే ‘ఎక్స్ ప్రెస్’తో ముందుకు దూసుకుపోతాడని అంతా భావించారు. కానీ.. ఆ చిత్రం తర్వాత అతడు ఏ చిత్రాన్ని తెరకెక్కించలేదు. ఈ నేపథ్యంలోనే ఇతనికి శర్వానంద్ బ్రేక్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో గాంధీ చాలాకాలం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న హీరో శర్వానంద్ తో దర్శకుడు మేర్లపాక గాంధీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం! ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘మిర్చి, రన్ రాజా రన్’ వంటి చిత్రాలను నిర్మించిన యూవీ క్రియేషన్ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సంస్థ గోపీచంద్ తో ‘జిల్’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తికాగానే.. శర్వానంద్ చిత్రం మొదలవుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharwanand movies  merlapaka gandhi director  uv creations  

Other Articles