Samantha ruth prabhu signed dhanush movie amy jackson kollywood news

samantha ruth prabhu, samantha latest news, samantha hot photos, samantha latest gallery, samantha photo shoot, samantha tamil movies, samantha dhanush movie, samantha dhanush news, dhanush movies, dhanush movie news, amy jackson news, amy jackson hot photos

samantha ruth prabhu signed dhanush movie amy jackson kollywood news : Samantha Ruth prabhu finally given green signal to act with dhanush in his latest tamil movie.

సమంత తకిట తదిమి తకిట తదిమి..

Posted: 02/24/2015 01:22 PM IST
Samantha ruth prabhu signed dhanush movie amy jackson kollywood news

ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే.. గ్లామర్ డాల్ సమంతా తకిట తదిమి తకిట తదిమి అంటూ తమిళంలో తందనాలు చేస్తోందని వార్తలొస్తున్నాయి. అంటే.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరొందిన ఈ అమ్మడికి తాను పుట్టిపెరిగిన తమిళంలో మాత్రం నిన్నటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. కానీ.. ఈ మధ్యే ఆమెకు కోలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. సూర్యతో కలిసి నటించిన ‘అంజాన్’ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ తర్వాత విజయ్ సరసన ఈమె నటించిన ‘కత్తి’ ఘనవిజయాన్ని సాధించింది. దాంతో ఈమెకు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈమె మరో తమిళ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం!

తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమంతా తెలుగులో వస్తున్న ఆఫర్లు తగ్గించుకుంటూ కోలీవుడ్ పై ఎక్కువ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఈమె అక్కడి పాపులర్ హీరోలతో సినిమాలు చేస్తే క్రేజ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం విక్రం, విజయ్ వంటి బడాహీరోల సరసన చిత్రాలు చేస్తున్న ఈ గ్లామర్ డాల్.. ధనుష్ సరసన నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం!

ఇటీవల ధనుష్ నటించిన VIP చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ చిత్రాన్ని నిర్మించిన యూనిట్ మళ్లీ అతనితోనే మరో చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీకి కూడా వేల్ రాజ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో ప్రధాన కథానాయికగా సమంతాను సంప్రదించగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట! ప్రస్తుతం ఆమె ఈ చిత్రం కోసం తన డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో నిమగ్నమైంది! ఇక ఈ చిత్రంలో మరో కథానాయికగా అమీ జాక్సన్ నటిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruth prabhu  dhanush movie  amy jackson  kollywood news  

Other Articles