Lb title gif

lb sriram condolences on ramanaidu death, lb sriram, writer and actor lb sriram, ramanaidu funeral with government honours, movie mughul ramanaidu, star producer ramanaidu, last rites with government honours, ramanaidu collections, ramanaidu passes away, Daggubati Ramanaidu, funeral, Telugu Film Industry Closed Today, Ramanaidu Cremation news, Daggubati Ramanaidu no more, Daggubati Ramanaidu passed away, Daggubati Ramanaidu died, Daggubati Ramanaidu death news, Daggubati Ramanaidu news, Daggubati Ramanaidu wiki, Daggubati Ramanaidu movies, Daggubati Ramanaidu dead body, Daggubati Ramanaidu dead body phots, Daggubati Ramanaidu, ramanaidu cremation at ramanaidu studios

lb sriram condolences on movie mughul, star producer ramanaidu death

సినీ పరిశ్రమ పెద్దోళ్లు హఠాత్తుగా మాయమైపోతున్నారు

Posted: 02/19/2015 02:02 PM IST
Lb title gif

తెలుగు సినీ పరిశ్రమకు మార్గనిర్ధేశకులుగా, మార్గదర్శకులుగా నిలిచిన పెద్దలు హఠాత్తుగా.. మాయమైపోతున్నారని టాలీవుడ్ హాస్యనటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రామానాయుడు భౌతికకాయానికి ఆయన గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ' కొత్తగా ఇండస్ట్రీకి  వచ్చే కొత్త దర్శకులకు, ఎంతో మందికి రామానాయుడు ఆశయం, ఆశ్రమం లాంటి వారని కోనియాడారు. నిర్మాతలకు దారి దీపం, ఎంతో ఎత్తుకు ఎదగాలనుకునే వారికి ఆయన చేయూతనిందించే ఎవరెస్ట్ శిఖరమన్నారు.

తనను సినిమా రంగంలో నిలబెట్టింది ఈవీవీ సత్యనారాయణ అయితే.. ఈవీవీ సత్యనారాయణను నిలబెట్టింది మాత్రం రామానాయుడు అని అన్నారు. ఎప్పటికైనా అందరూ పైకి వెళ్లిపోవాల్సిన వాళ్లే అయితే ఇలా సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్దవాళ్ళు అంతా హఠాత్తుగా మాయం అయిపోతుంటే సినిమా రంగం అనే పాఠశాల.. ఉపాధ్యాయులు లేని విద్యార్థులుగా మారుపోతోందని ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు. రామానాయుడి సినిమాల్లో తాను చాలా మంచి మంచి వేషాలు వేశానని గుర్తు చేసుకున్నారు.  షూటింగ్ లో భాగంగా తాను పలు విధేశాలకు వెళ్లగలిగానంటే రామానాయుడు చిత్రాలలో నటించడం ద్వారానేనన్నారు. ఆయనకు శ్రద్ధాంజలి' అని అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramanaidu  passes away  lb sriram  condolence  

Other Articles