Ramanaidu famous telugu producer movie moghal biography

ramanaidu news, rama naidu death news, rama naidu biography, rama naidu history, rama naidu cancer disease, rama naidu life story

ramanaidu famous telugu producer movie moghal biography ; The Special Story of famous telugu producer ramanaidu who died with cancer disease on feb 18 2015

దేశ సినీచరిత్రను శాసించిన మూవీ మోఘల్ మూగబోయారు...

Posted: 02/18/2015 04:10 PM IST
Ramanaidu famous telugu producer movie moghal biography

ఒక సామాన్యకుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన డా.రామానాయుడు... ‘మూవీ మోఘల్’గా అందనంత ఎత్తుకు ఎదిగారు. సినీ పరిశ్రమే జీవితంగా భావించి దానికోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు.. వందకుపైగా చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాత ఈయనే! సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా నేటి యువతరం నటీనటులతోనూ చిత్రాలు ఈయన తీశారంటే.. మూవీలపై ఈయనకు ఎంత మక్కువ వుందో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు.. ఓ మూవీ నిర్మాణ నేపథ్యంలో తన దగ్గర డబ్బుల లేకపోయినా.. వున్న ఆస్తి మొత్తం అమ్మేసి చిత్రాన్ని నిర్మించారు. ఇదిచాలు.. ఆయనేంటో తెలుసుకోవడానికి! ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండేవారు.

ఇండస్ట్రీలో ఈయన అందించిన సేవలకు ఎన్ని అవార్డులు, రివార్డులు లభించాయో వేళ్లమీద లెక్కపెట్టలేం. ఫిలింఫేర్, నంది, జాతీయ పురస్కారాలతోపాటు పద్మభూషణ్ అవార్డును పొందారు. 15 భాషలలో 155కి పైగా సినిమాలు నిర్మించిన ఈయనకు.. అత్యధిక సినిమాలు తీసిన నిర్మాతగా ఆయన గిన్నెస్ బుక్లోకి ఎక్కారు. అంతేకాదు.. 2003వ సంవత్సరంలో ‘‘పద్మ భూషణ్’’ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 9వ తేదీన రామానాయుడిగారికి గౌరవ పురస్కారమైన ‘‘దాదాసాహెబ్ ఫాల్కే’’ అవార్డును ప్రకటించింది. ఇలా ఎన్నెన్నో అవార్డులు ఆయనకు వరించాయి.

rama-naidu-01
rama-naidu-02
rama-naidu-03
rama-naidu-04
rama-naidu-photos

ఇండస్ట్రీలో గొప్ప నిర్మాతగా ఖ్యాతిగాంచి, మూవీ మోఘల్ గా పేరొందిన ఈయన.. 2015 ఫిబ్రవరి 8వ తేదీని చివరిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వివిధ రకాలుగా చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. ఆయన కేన్సర్ను అధిగమించి క్షేమంగా బయటకు వస్తారని అందరూ ఆశించారు గానీ, అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం ఆయన పరమపదించారు. ఈయన మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ తోపాటు ఎందరో సినీప్రముఖులు, ఇతర భాషా పరిశ్రమకు చెందినవారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రామానాయుడు 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. 1999-2004 మధ్య బాపట్ల ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఎంతో పేరుపొందిన రామానాయుడు   సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. మూవీ మొఘల్ గా పేరుపొందారు. తిరుగులేని నిర్మాతగా, మంచి మనిషిగా ఆయనకు పేరుంది. ఆయనకు ఇద్దరు కుమారులు నిర్మాత సురేష్ బాబు, నటుడు వెంకటేశ్లతో పాటు కుమార్తె లక్ష్మి ఉన్నారు. ఆయన భార్య రాజేశ్వరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : rama naidu history  telugu movie moghal  

Other Articles