Allu arjun special fight for son of sathyamurthi

Allu arjun special fight for son of sathyamurthi, Allu arjun son of sathyamurthi special fight, Allu arjun special fight, Allu arjun latest fight news, Allu arjun biggest fight, Allu arjun movie news, Allu arjun movie updates, Allu arjun in son of sathyamurthi, Allu arjun movie stills, Allu arjun movies, Nithya menon movies, Nithya menon movie news, Nithya menon stills, Nithya menon songs, Nithya menon with bunny, Devi sri prasad songs, Trivikram srinivas movie

Allu arjun special fight for son of sathyamurthi: allu arjun upcoming movie son of satyamurthi. trivikram srinivas direction. devisriprasad music. nithya menon heroine.

వెడ్డింగ్ ప్లానర్ స్టైలిష్ యాక్షన్

Posted: 02/09/2015 11:07 AM IST
Allu arjun special fight for son of sathyamurthi

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర షూటింగ్ లో బన్నీ బిజీగా వున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బన్నీ స్టైలిష్ వెడ్డింగ్ ప్లానర్ గా నటిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు డాన్సులలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్న బన్నీ.... ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ లలో కూడా భారీగా శ్రద్ధ తీసుకుంటున్నాడు.

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా అంతా ఒక ఎత్తైతే... ఆ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఒక ఎత్తు. ఆ యాక్షన్ ఎపిసోడ్ కు భారీగా స్పందన వచ్చింది. దీంతో బన్నీ డాన్సుల్లోనే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ లలో కూడా కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నాడు.

తాజాగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో కూడా బన్నీ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ లో నటించనున్నట్లుగా తెలిసింది. దాదాపు 100 మందితో బన్నీ స్టైలిష్ ఫైట్ చేయనున్నాడని తెలిసింది. త్వరలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్లుగా సమాచారం.

బన్నీ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  fight  Trivirkam  son of sathyamurthi  Nithya menon  Telugu movies  Tollywood  

Other Articles