Nitya to show her another talent

nitya to proove herself, nitya menon direction, nitya menon new movies, nitya menon latest movies, nitya menon latest news, nitya menon latest updates, nitya menon new stills, nitya menon photos, nitya menon latest news, nitya menon upcomming movies, nitya menon forth comming movies.

malayalam based heroine nitya menon to proove herself in the field of direction

మరో టాలెంట్ ను బయటపెట్టనున్న మలయాళ కుట్టి..

Posted: 02/09/2015 10:56 AM IST
Nitya to show her another talent

మళయాళ కుట్టిగా తెలుగు వెండి తెరకు పరిచమైన ప్రేక్షకుల ఆదరాభిమానాలను పోందిన నటి నిత్యా మీనన్. మొదటి సినిమాతోనే తనలోని వైవిద్యానికి ప్రేక్షకుల ముందు అవిష్కరించి శబాష్ అనిపించుకుంది. అటు నటిగా, ఇటు గాయనిగా తనలోని భిన్నమైన టాలెంట్ ను ప్రదర్శించి అభిమానులను సొంతం చేసుకోవడంతో ముందు నిలిచింది. మొదటి నుంచి తన స్టొరీ సెలక్షన్స్ మరియు నటనలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తోంది. వరుస సక్సెస్ లతో హిట్ హీరోయిన్ జాబితాలోకి చేరిన ఈ అమ్మడు.. తాజాగా మరో ప్రయోగం చేయనుందట.

అదేంటంటే తనలోని మరో టాలెంట్ ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయనుందట. అదేంటి అనుకుంటున్నారా.. త్వరలోనే లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ మెగా ఫోన్ పట్టుకుని అరవనుందట. నిజమేనండీ.. త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనుందట. అది కూడా సాదాసీదా సినిమా కాదండీ.. తనను ఎంతగానో ప్రభావితం చేసిన ఓ ప్రముఖురాలి జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నంలో వుంది నిత్యా. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో ఉందట.

నిత్యా మీనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నిత్య చేసిన ముస్లీం అమ్మాయి నజీమ్ పాత్ర ఎలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యా మీనన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేనొక పుస్తకాల పురుగును. ఈజిప్షియన్ సింగర్ బయోగ్రఫీ చదివి నాకు మతి పోయింది. ఆ బుక్ విషయంలో ఎంతో కదిలిపోయింది. నిత్యా మీనన్ తన జీవితాదారంగా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకుంది. కావున త్వరలోనే నిత్యా మీనన్ మెగా ఫోన్ పట్టుకొని ఓ సినిమాకి దర్శకత్వం చేస్తుంది నిత్యా.. సో విష్ హర్ గుడ్ లక్..

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitya menon  direction  egyptian singer  

Other Articles