Allu arjun next movie with anil ravipudi

allu arjun next movie with anil ravipudi, allu arjun movie with anil ravipudi, anil ravipudi latest news, anil ravipudi next movie, anil ravipudi movie updates, anil ravipudi new movie, anil ravipudi movie news, anil ravipudi

allu arjun next movie with anil ravipudi: director Anil ravipudi got very big block buster hit with Pataas movie. as per latest news... Allu arjun and Ram charan`s trying to do a movie with anil ravipudi.

పటాస్ కుర్రాడి కోసం మెగా హీరోలు

Posted: 02/09/2015 11:47 AM IST
Allu arjun next movie with anil ravipudi

నందమూరి కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యిన విషయం తెలిసిందే. యాక్షన్, ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం హీరోగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు భారీ క్రేజ్, డబ్బులను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కళ్యాణ్ రామ్ ను ఓ కొత్త పాత్రలో చూపించి, దర్శకుడిగా మొదటి సినిమాతోనే హిట్టు కొట్టాడు.

కళ్యాణ్ రామ్ కు ఎంత పేరొచ్చిందో... దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా భారీ క్రేజ్ వచ్చింది. దర్శకుడిగా తొలి సినిమా అయినప్పటికీ... బాగా కసితో తీసి ఓ కమర్షియల్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అనిల్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ డిమాండ్ ఏర్పడింది.

ఈ దర్శకుడితో సినిమా చేయడానికి మెగా హీరోలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. అనిల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయడానికి సిద్ధంగా వున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న త్రివిక్రమ్ సినిమా పూర్తవ్వగానే అనిల్ తో బన్నీ ఓ సినిమా చేసే అవకాశం వున్నట్లుగా టాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి.

అలాగే అనిల్ తో సినిమా చేయడానికి రాంచరణ్ కూడా ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. కుదిరితే మరోసారి కళ్యాణ్ రామ్ తోనే సినిమా తీయడానికి ఈ ‘పటాస్’ దర్శకుడు సిద్ధంగా వున్నట్లుగా తెలిసింది. అయితే అనిల్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే తన కొత్త సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil ravipudi  Movie  Allu arjun  Ram charan  Pataas  telugu news  

Other Articles