Ram charan srinu vaitla my name is raju movie anirudh music director tollywood news

ram charan movie news, ram charan my name is raju movie, my name is raju movie news, music director anirudh, anirudh latest news, anirudh latest movies, anirudh songs, ram charan anirudh news, ram charan samantha news

ram charan srinu vaitla my name is raju movie anirudh music director tollywood news : Tamil Young Music director is giving tunes to ram charan's my name is raju movie.

చెర్రీ మూవీకి స్వరాలు అందిస్తున్న అనిరుధ్...

Posted: 02/07/2015 04:22 PM IST
Ram charan srinu vaitla my name is raju movie anirudh music director tollywood news

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! యూనివర్సల్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ ఖరారైన ఈ మూవీలో చెర్రీ సరసన హీరోయిన్’గా సమంత నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుంచి ప్రారంభం కానుంది.

ఇదిలావుండగా.. తాజాగా అందిన సమాచారాల ప్రకారం ఈ మూవీకి ‘కొలవెరి డి’ సాంగ్ ఫేం అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. అతడు కూడా అప్పుడే ఈ మూవీకోసం పాటలను సమకూర్చే పనిలో నిమగ్నమయ్యాడని సమాచారం! అంటే.. చెర్రీ మూవీతో అనిరుధ్ తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతున్నాడన్నమాట! ఇక గతంలో కొన్ని విభేదాల కారణంగా విడిపోయిన శ్రీనువైట్ల, రచయిత ద్వయం కోనవెంకట్-గోపి మోహన్’లు తిరిగి ఈ మూవీతో ఒక్కటవుతున్నారు. చెర్రీ కోసం ఈ రచయితలు కొత్త తరహా కథను రెడీ చేశారని తెలిసింది.

ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి కావడంతో మూవీ షూటింగ్’ను త్వరగా పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అటు చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా యావరేజ్ హిట్ కొట్టడం, శ్రీనువైట్ల రూపొందించిన ‘ఆగడు’ మూవీ భారీగా ఫ్లాప్ కావడంతో.. ఆ ఇద్దరూ ఈ మూవీపైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles