Amitabh bachchan speech shamitabh movie audio launch

amitabh bachchan news, shamitabh movie news, ilayaraja news, rajinikanth news, kamal hassan news, shamitabh audio function, amitabh bachchan ilayaraja news

amitabh bachchan speech shamitabh movie audio launch : the bollywood big b said that he will never sing song infront of great music director ilayaraja. Because whenever he try to sing infront of him.. he became nervous and and feel uncomfortable.

లయ స్వరకారుడికి జంకుతున్న బిగ్ బీ!

Posted: 01/21/2015 03:05 PM IST
Amitabh bachchan speech shamitabh movie audio launch

ఎదగడం, ఒదగడం.. ఈ రెండు విషయాలను అమితాబ్ బచ్చన్ బాగా అవపోసిన వ్యక్తి! భారత్’తోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంటున్న బిగ్ బీ.. ఇంటింటై వటుడింతై అన్నట్లుగా ముందుకు సాగిపోతున్నారు. తాను ఏ స్థాయికి చేరుకున్న ఒదిగేవుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ విలక్షణ నటుడుకి ఇంకా అభిమాన బలం పెరుగుతోందంటే.. అందుకు కారణం ఆయనలో వున్న ఆ రెండు లక్షణాలే! అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వచ్చిందనుకుంటున్నారా..? అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

ధనుష్, అక్షర, అమితాబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘షమితాబ్’ చిత్రం ముంబైలో ఆడియో లాంచ్ వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే! ఈ వేడుక సందర్భంగా ఈ చిత్రానికి స్వరాలు అందించిన ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజాతోపాటు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగానే స్టేజిపై మాట్లాడిన అమితాబ్.. తాను అవపోసిపట్టిన లక్షణాలను బయటపెట్టారు. తానెప్పుడూ ఇళయరాజా ముందు పాడే ధైర్యం చేయలేదని ఆయన అన్నారు.

‘‘ఇళయరాజా ముందు పాడే ధైర్యం నేనెప్పుడూ చేయలేదు. ఎందుకంటే.. అలా చాలా ఇబ్బందికరంగా వుంటుదనుకుంటున్నాను. అందుకే, ప్రతిసారీ రికార్డింగ్ సమయంలో స్టూడియోలా విడిగా కూర్చుంటా. (‘పా’ చిత్రంలో ఓ పాటపాడిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు). అదెంత భయపెడుతుందో మాటల్లో నేను వర్ణించలేను’’ అని పేర్కొన్నారు. చివరగా ఇళయరాజానుఓ జీనియర్’గా బిగ్ బీ అభివర్ణించారు. దటీజ్ బిగ్ బీ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan news  shamitabh movie news  ilayaraja news  rajinikanth news  

Other Articles