Gopichand jil movie distribution rights great india films

gopichand latest news, gopichand jil movie, jil movie first look, jil movie stills, jil movie news, jil movie latest gallery, jil movie photos, jil movie news, rashi khanna hot photos, rashi khanna hot photo shoot, great india films

gopichand jil movie distribution rights great india films : tollywood macho hero gopichand latest movie jil distribution rights has sold by great india films with high cost.

వారెవ్వా గోపీచంద్.. ఏం ‘జిల్’మన్నావయ్యా!

Posted: 01/15/2015 07:53 PM IST
Gopichand jil movie distribution rights great india films

టాలీవుడ్ మాచో హీరోగా పేరొందిన నటుడు గోపీచంద్.. ‘లౌక్యం’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న తర్వాత తదుపరి చిత్రం ‘జిల్’లో నటిస్తున్న విషయం తెలిసిందే! ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ఈ చిత్రంలో గోపీ సరసన ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశిఖన్నా హీరోయిన్’గా నటిస్తోంది. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమవున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ మూవీకి తన స్వరాలను అందిస్తున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్’లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ.. దాదాపుగా 80% షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు సమాచారం! ఫిబ్రవరి చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తోంది. జనవరి చివరికల్లా షూటింగ్ ఫినిష్ చేసుకుని.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా ముగించేసి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేనెల మొదటిరోజుల్లో మూవీ ఆడియో ఫంక్షన్’తోబాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు వున్నాయి. గతంలో కంటే ఈ చిత్రంలో గోపీచంద్ సరికొత్త లుక్’లో కనిపంచనున్నాడని, కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడని యూనిట్ బృందాలు అంటున్నాయి.

ఇదిలావుండగా.. తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్’ని గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు ఎక్కువ మొత్తాన్ని ముట్టజెప్పి మరీ సొంతం చేసుకుందని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇంకా షూటింగ్ దశలోనే వుండగా అప్పుడే దీని రైట్స్ కొనుగోలు అమ్ముడుపోవడంతో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో గోపీచంద్ ఫేట్ మరింతగా మారనుందని, అలాగే రాశిఖన్నా కెరీర్ మలుపు తిరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. మరీ.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand jil movie  great india films  rashi khanna  

Other Articles