Hero nani yevade subramanyam movie trailer release sankranti festival

yevade subramanyam movie news, yevade subramanyam trailer, yevade subramanyam movie updates, hero nani news, hero nani yevade subramanyam movie, hero nani latest movies, telugu hero nani, eega hero nani, ritu varma latest news, ritu varma hot photo shoot, malavika nair latest news

hero nani yevade subramanyam movie trailer release sankranti festival : tollywood hero nani latest movie yevadu subramanyam trailer has released on sankranti festival. according to this trailer.. this time nani is came with an interesting story.

ఎవడీ సుబ్రమణ్యం.. పెంట్ హౌస్ నుంచి టెంట్ కొచ్చాడు!

Posted: 01/15/2015 06:36 PM IST
Hero nani yevade subramanyam movie trailer release sankranti festival

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం ద్వారా ఒక్కసారిగా స్టార్’డమ్ సంపాదించిన హీరో నాని.. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర పటాపంచలైపోయాయి. దీంతో ఈ హీరో ఇమేజ్ ఒక్కసారిగా దిగజారిపోయింది. ‘ఈగ’ తర్వాత స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిపోతాడనుకుంటే.. అనుకోకుండా కూలిపోయాడు. దాంతో ఈ హీరో కొన్నాళ్లవరకు ఇండస్ట్రీ నుంచి గ్యాప్ పాటించాడు. అంతేకాదు.. తాను నటించబోయే మూవీ కథ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు పాటించాడు. ఏదైనా కొత్త తరహా కథతో తిరిగి తెరమీదకొద్దామని ఫిక్స్ అయిన ఈ హీరో.. తాజాగా ‘ఎవడే సుబ్రమణ్యం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఫస్ట్’లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. అందులో నాని ఒకవైపు కూర్చుని వుంటే, మరోవైపు సాధువులు వున్నారు. ఇక బ్యాక్’డ్రాప్’లో అందమైన హిమాలయాలతోబాటు ఓ గుడిని చూపించడంతో ఆ పోస్టర్లకు అనూహ్య స్పందన లభించింది. ఈసారి నాని ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నాడని అందరూ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఏ విధంగా అయితే నాని తన ఫస్ట్’లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో.. ఈ ట్రైలర్’లోనూ అదేవిధంగా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్’తో ముందుకొచ్చాడు.

నాని వాయిస్’తో మొదలయ్యే ఈ ట్రైలర్ విశ్లేషణ ఏమిటంటే.. సాఫ్ట్’వేర్ జీవనం కొనసాగిస్తున్న 25ఏళ్ల నాని.. త్వరలోనే ఓ మిలియన్ డాలర్ కంపెనీకి హెడ్’గా పదవి దక్కించుకోనున్నాడు. దాంతో తన జీవితం మరెంతో హాయిగా తన గర్ల్’ఫ్రెండ్’తో కొనసాగించవచ్చునని భావిస్తుండగానే.. అతని జీవితంలో ఓ ఫ్రెండ్ ఎంటర్ అవుతాడు. అతడితోపాటు ఓ అమ్మాయి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వారిద్దరి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే నాని.. అనుకోకుండా హిమాలయాల్లో తేలుతారు. అసలు వాళ్లు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? ఈ మూవీకి, టైటిల్’కి లింకేంటి..? అన్న ఇంట్రెస్టింగ్ టాపిక్’తో కథ సాగుతుందన్నమాట!

ఇంత ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో నానికి.. ఈసారైనా ఫేట్ మారుతుందేమో వేచి చూడాల్సిందే! ఈ చిత్రంలో హీరో నానితోబాటు రితు వర్మ, మాలవిక నాయర్, దేవరకొండ నాయర్ లీడ్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఫేమస్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కుమార్తె ప్రియాంకా దత్ నిర్మిస్తుండగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి.. ఈ మూవీని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yevade subramanyam movie  hero nani  ritu varma updates  telugu news  

Other Articles