బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొనె, యంగ్ హీరో రణబీర్ కపూర్ గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం తెలిసిందే! ఏమాత్రం మొహమాటం లేకుండా బహిరంగంగా ఒకరిమీద మరొకరు వాలిపోతూ, కొన్నాళ్లపాటు లైఫ్’ని ఎంజాయ్ చేసిన ఈ జంట.. తరువాత విడిపోయింది. అయినప్పటికీ ఇద్దరు స్నేహితులుగానే వుంటూ.. కలిసి సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. తాజా పరిణామాలను చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రణబీర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని దీపికా.. ఇప్పుడు అతడ్ని పెళ్లి చేసుకునేదాన్ని అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కొత్త సంవత్సరం ప్రారంభమైన కొద్దిరోజుల వరకు కెమెరాకు కనిపించని సన్నజాజి నడుముభామ దీపికా.. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నూతన సంవత్సరంలో భాగంగా తన తీర్మానమేంటో వెల్లడించాల్సిందిగా కోరితే.. అందుకు ఆమె దిమ్మతిరిగిపోయేలా సమాధానం ఇచ్చింది. ఆ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న దీపికను కొందరు.. ‘మీరు కత్రినాకైఫ్ అయితే కొత్త సంవత్సరం సందర్భంగా తీసుకునే తీర్మానం ఏంటి?’ అని అడిగారు. దీని ఈమె సమాధానమిస్తూ.. ‘నేనే కత్రినా అయితే రణబీర్ ను పెళ్లి చేసుకునేదాన్ని’ అంటూ తెలిపింది. దీంతో అక్కడున్నవాళ్లు ఒక్కసారిగా నవ్వి ఊరుకున్నారు.
ఆ కార్యక్రమం సందర్భంగా మొదట్లో దీన్ని జోక్’గానే పరగణించారుగానీ.. నిజానికి ఆమె ఇటువంటి సమాధానం ఎందుకు ఇచ్చిందనేది అంతుచిక్కడం లేదు. గతంలో ఈవిధమైన ప్రశ్ననే అడిగినప్పుడు ‘కత్రినాను రణబీర్’ని పెళ్లి చేసుకోవద్దని సలహా ఇస్తాను’ అని సమాధానం ఇచ్చిన ఈ అమ్మడు.. ఈసారి ‘తానే కత్రినా అయితే పెళ్లి చేసుకుంటా’ అని చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కత్రినాకు దీపికా సలహా ఇస్తోందా..? లేక ఆమె ఇంకా రణబీర్’నే ప్రేమిస్తోందా..? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. ఇక్కడ దీపికా తెలివిగా సమాధానమిచ్చి తాను మాత్రం సింపుల్’గానే ఎస్కేప్ అయ్యిందని చెప్పుకోవచ్చు. మరి.. దీనిపై కత్రినా స్పందన ఎలా వుంటుందో?
AS
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more