Kajal agarwal latest interview news movie offers

kajal agarwal news, kajal agarwal interview, kajal agarwal hot photo shoot, kajal agarwal latest gallery, kajal agarwal movies, kajal agarwal temper movie, kajal agarwal photo sessions, kajal agarwal wikipedia, kajal agarwal life story, kajal agarwal filmography, kajal agarwal photos

kajal agarwal latest interview news movie offers : kajal agarwal giving suggestions to all upcoming actresses to take good decision before accepting any movie.

అలాంటి తొందరపాటు తప్పులు చేయలేదు!

Posted: 01/15/2015 12:47 PM IST
Kajal agarwal latest interview news movie offers

ఇండస్ట్రీలో హీరోయిన్’గా స్థానం దక్కించుకోవాలంటే తారలకు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. తెరముందుకంటే తెరవెనుకే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే తాను అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదని కాజల్ చెబుతోంది. తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్’గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్.. తన వ్యక్తిగత వ్యవహారాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నిజానికి గతంలో తన గురించి చెప్పేందుకు ఎప్పుడూ పెడమోహం పెట్టే ఈ అమ్మడు.. ఈసారి మాత్రం మొహమాటం లేకుండా అన్ని విషయాలు తెలిపింది. సినిమాపరంగా తాను చేసిన తప్పులేంటి..? ఎటువంటి జాగ్రత్తలు పాటించింది..? అన్న విషయాలపై సవివరంగా చెప్పింది.

ప్రస్తుతం ‘టెంపర్’ మూవీ షూటింగ్ బిజీగా వున్న బొద్దుగుమ్మ కాజల్.. ఏదైనా సినిమా ఒప్పుకునే విషయంలో ఎటువంటి తొందరపాటు తప్పులు చేయలేదని అంటోంది. ‘సినిమా అంటే ఆషామాషీ విషయం కాదు. ఒక్కసారి ఏదైనా చిత్రంలో నటించామంటే మళ్లీ దాన్ని తుడిచేయడం చాలా కష్టం. అందుకే.. కెమెరాముందుకు రావడానికి ముందే ఎంతో ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వుంటుంది. కథలు, పాత్రల విషయంలో ఎప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా పాత్రల విషయంలో చాలా ఆలోచించాల్సి వస్తుంది. అదృష్టవశాత్తూ నేను అలా తొందరపడి ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు’ అని అంటోంది.

అంటే.. ఇంతవరకూ తాను నటించిన చిత్రాలు తనకు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టాయని, తాను ఒప్పుకున్న పాత్రలు తనను మంచి నటిగా నిలబెట్టాయని వివరిస్తోంది కాజల్! ‘అయ్యో గతంలో అలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వుంటే బాగుండేదేమో’ అని ఆలోచించుకునే పరిస్థితి రాకుండా వుండాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ అమ్మడు సలహాలు ఇస్తోంది. అలా తీసుకోకపోతే.. భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదిగినా గతంలో చేసిన తప్పులు మాత్రం జీవితాంతం వెంటాడుతూనే వుంటాయని.. ఆ తప్పులు చరిత్రగా మిగిలిపోయి తీవ్ర అవమానం కలిగించే విధంగా వుంటాయని స్పష్టం చేస్తోంది.

ఇదిలావుండగా.. తనకు సాహసం చేయడం అంటే ఎంతో ఇష్టమంటూ ఈ పంజాబీ భామ అంటోంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా స్కై డైవింగ్, డీప్ సీ డైవింగ్ వంటి సాహసాలు చేస్తుంటుందని అమ్మడు పేర్కొంది. అయితే.. సినిమాల్లో అలాంటి సహాసాలు చేయనందుకు చాలా బాధగా వుందని పేర్కొంటోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal interview  telugu heroines  actresses hot photo shoots  telugu news  

Other Articles